Bigg Boss 4: నామినేషన్‌లో ఉన్న వారికి బిగ్‌బాస్‌ ఆఫర్.. కానీ

ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారికి బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చారు. వీరిలో ఒకరు ఇమ్యూనిటీ పొంది సేవ్ అయ్యేందుకు ముఖం జాగ్రత్త అన్న టాస్క్‌ ఇచ్చాడు.

Bigg Boss 4: నామినేషన్‌లో ఉన్న వారికి బిగ్‌బాస్‌ ఆఫర్.. కానీ

Edited By:

Updated on: Nov 04, 2020 | 8:23 AM

Nominate Contestants Bigg Boss 4: ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారికి బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చారు. వీరిలో ఒకరు ఇమ్యూనిటీ పొంది సేవ్ అయ్యేందుకు ముఖం జాగ్రత్త అన్న టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా నామినేట్ అయిన వాళ్లు టీ స్టాండ్ మీద ముఖం పెట్టాలి. బజర్ మోగే వరకు ఎవరి తల స్టాండ్ మీద ఉంటే వారు నామినేషన్ నుంచి సేఫ్ అయినట్లు తెలిపాడు. ఇది ఒక్కరికే వర్తిస్తుందని పేర్కొన్నారు. ( Bigg Boss 4: నువ్వు నోర్మూయ్‌.. హారికపై మాస్టర్ ఫైర్‌)

ఇక ఈ టాస్క్‌లో మిగిలిన హౌజ్‌మేట్స్ నామినేట్ అయిన వారిని ఐస్‌ గడ్డలు, నీళ్లు, గడ్డి, మట్టి ఉపయోగిస్తూ వారి ముఖంపై పోస్తూ ఇబ్బంది పెట్టారు. ఇక మోనాల్‌ని ఎక్కువగా హింసించినట్లు కనిపించగా.. అది చూసి తట్టుకోలేకపోయిన అఖిల్‌.. ఆమె దగ్గరకు వచ్చి ముఖం శుభ్రం చేశారు. మరి మెహబూబ్‌, మాస్టర్‌కి సాయం చేస్తే ఎందుకు వ్యతిరేకించావని సొహైల్‌, అఖిల్‌పై అరిచాడు. అలా వారిద్దరు కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ఇక చివరగా ఎండ్ బ‌జ‌ర్ మోగేస‌రికి మోనాల్‌, అవినాష్‌, అమ్మ రాజశేఖర్ స్టడీగా ఉన్నారు. ఇలా ఒకరి కన్నా ఎక్కువ మంది ఉండటంతో ఎవ్వరికీ ఇమ్యూనిటీ లభించలేదు. (Breaking: కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూత)

Follow Us