Bigg Boss 4 Ariyana: బిగ్‌బాస్ 4లో ఈ వారానికి గానూ కెప్టెన్‌గా అవినాష్ ఎన్నిక కాగా.. అతడు అరియానాకు రేషన్ మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు. ఆ తరువాత ఆమెను స్టోర్ రూమ్‌లోకి రమ్మని బిగ్‌బాస్ పిలిచాడు. ఈ సందర్భంగా ఈ వారానికి సరిపడా రేషన్, అభిజీత్ నుంచి గతంలో తీసుకున్న బట్టలు, ఇతర వస్తువులు అరియానా ముందు పెట్టారు. వీటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలని ఆమెకు సూచించారు. దీంతో అరియానా కాస్త ఆలోచించింది. అయితే అభిజీత్ దుస్తులు ఈ వారానికి మాత్రమే ఇవ్వరా..? ఈ సీజన్ మొత్తం ఇవ్వరా..? తనకు క్లారిటీ ఇవ్వాలని కోరింది. తోటి కంటెస్టెంటు బట్టలు లేకుండా సీజన్ మొత్తం బాధపడటం తనకు ఇష్టం లేదని, కావాలంటే ఈ ఒక్కవారం ఎలాగోలా అందరం సర్దుకుపోతాం అని చెప్పుకొచ్చింది. దానికి సమాధానం ఇవ్వని బిగ్‌బాస్.. ఈ రెండింటిలో ఏం కావాలో తేల్చుకోవాలని తెగేసి చెప్పారు. అయితే ఆమె ఏం తీసుకుంటోందోనని అందరిలో టెన్షన్ పెరిగింది. అభి కోసం అందరి కడుపు మాడుస్తుందని భావించారు. కానీ చివరి నిమిషంలో అభికి సారీ చెప్పిన అరియానా.. రేషన్ తీసుకొచ్చింది. దీంతో అభి సహా కుటుంబ సభ్యులు మొత్తం ఊపిరి పీల్చుకున్నారు.
Read more:
Bigg Boss 4: అవినాష్ కఠిన రూల్స్.. ఒప్పుకున్న హౌజ్‌మేట్స్
Bigg Boss 4: హారిక మాటను గుర్తుపెట్టుకున్న అవినాష్.. అరియానాకు పోస్ట్