Bigg Boss 4: నేను చచ్చిపోయి ఏడాది అయ్యుండేది.. భయంకర యాక్సిడెంట్‌ని గుర్తు చేసుకున్న అరియానా

సీక్రెట్‌లు బయటపెట్టాలన్న టాస్క్‌లో భాగంగా అరియానా తను ఎదుర్కొన్న ఓ యాక్సిడెంట్‌ని కన్ఫెషన్‌ రూమ్‌లో గుర్తుచేసుకుంది.

Bigg Boss 4: నేను చచ్చిపోయి ఏడాది అయ్యుండేది.. భయంకర యాక్సిడెంట్‌ని గుర్తు చేసుకున్న అరియానా

Edited By:

Updated on: Nov 13, 2020 | 9:11 AM

Bigg Boss 4 Ariyana: సీక్రెట్‌లు బయటపెట్టాలన్న టాస్క్‌లో భాగంగా అరియానా తను ఎదుర్కొన్న ఓ యాక్సిడెంట్‌ని కన్ఫెషన్‌ రూమ్‌లో గుర్తుచేసుకుంది. గతేడాది జూలై 13న నాతో పాటు నలుగురుం మా ఊరికి వెళ్దాం అనుకున్నాము. అర్ధరాత్రి కారులో అందరం బయలుదేరాం. ఒక మనిషి బైక్‌పై మాకు అడ్డు వచ్చాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక కిలోమీటర్ వరకు కారు దూసుకెళ్లి ఎలక్ట్రిక్ పోల్‌ని గుద్దింది. కారు నుజ్జు నుజ్జు అయ్యింది. బయటకు వస్తే వైరులు తగిలి షాక్ కొట్టేది. ఆ ప్రమాదం నుంచి మేము ఎలాగోలా బయటపడ్డాము. లేకపోతే ఇప్పటికీ మేము చనిపోయి ఏడాది అయ్యుండేది అని చెప్పింది. అయితే ఇది సీక్రెట్ కాదంటూ ఆమెకు వచ్చిన లెటర్‌ని అఖిల్‌ చించేశాడు.