బిగ్ బాస్ 4: టైటిల్ గెలిచేందుకు అరియానాకు అర్హత లేదు.! తేల్చిసిన మెజారిటీ ఫైన‌లిస్టులు.. మరి ఫ్యాన్స్ మాటేంటి.?

|

Dec 15, 2020 | 9:06 AM

బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా చివరి వారంలోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్‌లో టాప్ 5 కంటెస్టెంట్ల మధ్య గొడవ పెట్టేందుకు బిగ్ బాస్ మరోసారి..

బిగ్ బాస్ 4: టైటిల్ గెలిచేందుకు అరియానాకు అర్హత లేదు.! తేల్చిసిన మెజారిటీ ఫైన‌లిస్టులు.. మరి ఫ్యాన్స్ మాటేంటి.?
Follow us on

Bigg Boss 4: బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా చివరి వారంలోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్‌లో టాప్ 5 కంటెస్టెంట్ల మధ్య గొడవ పెట్టేందుకు బిగ్ బాస్ మరోసారి ప్రయత్నించి విఫలమయ్యాడని చెప్పాలి. ఇదిలా ఉంటే ఫైనలిస్టులకు తాము ఎందుకు విజేత కావడానికి అర్హులో.. ట్రోఫీ గెలిచేందుకు అర్హత లేనివారు ఎవరో చెప్పాలంటూ ఓ టాస్క్ పెట్టాడు. ఇందులో మెజారిటీ ఫైనలిస్టులు.. అమ్మాయిల పేర్లు వినిపించడం జరిగింది. దీనితో ట్రోఫీని ఎలాగైనా గెలవాలన్న కసి అమ్మాయిల్లో మరింతగా పెరిగింది.

”నేను ఎక్కువ సార్లు ఎలిమినేషన్‌కు నామినేట్ అయి.. సేఫ్ అయ్యాను. కాబట్టి ట్రోఫీ గెలిచేందుకు అర్హుడ్ని అని అనుకుంటున్నాను. టైటిల్ కోసం హారికతో పోటీపడటం నేను తట్టుకోలేను. అందుకు ఆమె అర్హురాలు కాకూడదని” అభిజిత్ చెప్పాడు. టాస్కుల్లో కొన్నిసార్లు హద్దు దాటినందుకు అరియానా అనర్హురాలు అనుకుంటున్నానని అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక సోహైల్.. అరియానా, అభిజిత్ అనర్హులు అని, హారిక.. అరియానా అనర్హురాలు అని తెలిపింది. దీనితో మెజారిటీ ఫైనలిస్టులు అరియానా విజేత అయ్యేందుకు అర్హురాలు కాదని తేల్చేశారు.

”అందరూ తన పేరును చెబుతున్నారంటే.. ఖచ్చితంగా తాను గేమర్‌ అని.. ట్రోఫీ గెలుచుకునేందుకు తాను అర్హురాలినని చివరిగా మాట్లాడిన అరియానా ధీమాగా తన మనసులోని మాటను బయటపెట్టింది. కొన్ని సందర్భాల్లో హారిక సరైన నిర్ణయాలు తీసుకోదంటూ ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది. ఇక టాస్క్ అయిన అనంతరం హారిక, అరియానా మాట్లాడుకుంటూ.. అనర్హులుగా అమ్మాయిలు పేర్లు రావడాన్ని తట్టుకోలేకపోయారు. ఎలాగైనా ట్రోఫీ గెలవాలని కసి పెంచుకున్నారు.

Also Read:

తొలి దశలో కోటి మందికి టీకా.. హెల్త్‌కేర్‌ వర్కర్లకే మొదటి ప్రాధాన్యత.. కోవిడ్ వ్యాక్సినేషన్‌కు ఏపీ ప్రభుత్వం సిద్ధం.!

బిగ్ బాస్ ప్రైజ్ మనీతో ఏం చేస్తారు.? రైతుల కోసం డ‌బ్బు ప‌క్క‌న పెడతానన్న అరియానా.. శభాష్ అంటున్న నెటిజన్లు.!

మగువలకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఫిబ్రవరి 2021 నాటికి రూ. 42,000 చేరుకునే అవకాశం..!