Bigg Boss 4: నామినేషన్‌లో ఏడుగురు.. మర్డర్‌లతో రెచ్చిపోయిన అఖిల్‌‌

| Edited By:

Sep 29, 2020 | 7:32 AM

బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 దూసుకుపోతోంది. నిన్నటి ఎపిసోడ్‌లో నాలుగోవారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్ల టాస్క్ జరిగింది

Bigg Boss 4: నామినేషన్‌లో ఏడుగురు.. మర్డర్‌లతో రెచ్చిపోయిన అఖిల్‌‌
Follow us on

Bigg Boss 4 Nominations: బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 దూసుకుపోతోంది. నిన్నటి ఎపిసోడ్‌లో నాలుగోవారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్ల టాస్క్ జరిగింది. బజర్ మోగినప్పుడల్లా కంటెస్టెంట్లు పరుగెత్తుకెళ్లాలని బిగ్‌బాస్‌, కంటెస్టెంట్‌లకు తెలిపారు. మొదట ఎవరు పరిగెడితే వాళ్లకు మరొకరిని నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుందని.. ఇలా మొదటి ఐదుగురికి ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. రూమ్‌లో సొహైల్, అఖిల్‌లను కిల్లర్స్‌గా బిగ్‌బాస్‌ తెలిపారు. కంటెస్టెంట్‌లు వచ్చి ఎవరి పేరు చెబితే వారిని సొహైల్, అఖిల్‌లలో ఒకరు టేబుల్‌పై ఉన్న గన్‌ను తీసుకొని మర్డర్ చేసి రావాలి. ఆ తరువాత మర్డర్ చేసిన వారికి నామినేట్ చేసిన కంటెస్టెంట్ రూ.10 వేలు ఇస్తారు.

మొదటగా డెన్‌లోకి అమ్మ రాజశేఖర్ మాస్టర్ రియల్‌గా లేదని స్వాతిని నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు. దాంతో నన్ను దేవత అని నామినేట్ చేస్తావా..? అని స్వాతి, అమ్మ రాజశేఖర్‌ని అడిగారు. తరువాత మెహబూబ్ వెళ్లి అభిని నామినేట్ చేశారు. ఇక అరియానా, లాస్యని.. హారిక, మెహబూబ్‌ని.. సుజాత, కుమార్ సాయిని నామినేట్ చేశారు. కాగా నామినేషన్లు చేసే సమయంలో అఖిల్‌ వరుస మర్డర్లతో చెలరేగిపోయారు. దీంతో సొహైల్ బాగా ఇరిటేట్ అయ్యారు. నాలుగు సార్లు అఖిల్ మర్డర్ చేయగా.. సొహైల్‌ ఒకరిని మాత్రమే మర్డర్ చేయగలిగారు.

ఇక అఖిల్ డబ్బును సొహైల్‌ కొట్టేసినప్పటికీ.. తక్కువ డబ్బు ఉన్న కారణంగా సొహైల్‌ ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. ఎక్కువ డబ్బు ఉండటంతో అఖిల్ సేఫ్ అయ్యారు. ఇక అఖిల్ దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నందున ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఉందని బిగ్‌బాస్ చెప్పడంతో.. అతడు హారికను నామినేట్ చేశారు. దీంతో ఈ వారం స్వాతి, అభిజిత్, లాస్య, మెహబూబ్, కుమార్, సొహైల్, హారికలు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.

Read More:

ఆర్సీబీ సూపర్‌ విక్టరీ

అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే భూసేకరణకు 100 కోట్లు