18 ఏళ్ళకే ఇండస్ట్రీలోకి వచ్చా.. బిగ్‏బాస్ టైటిల్ నాకు చాలా ముఖ్యం.. సోహైల్ ఆవేదన

|

Dec 10, 2020 | 7:23 AM

Big Boss Season 4: ఓపిక టాస్క్‏లో అభిజిత్ ఎలాంటి ఎక్స్‏ప్రెషన్స్ ఇవ్వకుండా ఉండడంతో పూర్తిగా ఓడిపోయాడు. కానీ హౌస్‏లో అందరిని నవ్వించాడు. కాగా ఈ టాస్క్‏లో ఒక్క ఎక్స్‏ప్రెషన్ కూడా ఇవ్వకుండా సోహైల్ గెలిచాడు. దీంతో అతడు ప్రేక్షకులతో మాట్లాడే అవకాశాన్ని అందుకున్నాడు. ” 18 సంవత్సరాలకే ఇండస్ట్రీలోకి వచ్చాను. పదేళ్ళు గడుస్తున్నా ఇంకా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‏బాస్ టైటిల్ కొట్టాలన్నదే నా లక్ష్యం. నా కోపం మీకు నచ్చకపోతే క్షమించండి. కానీ నేను […]

18 ఏళ్ళకే ఇండస్ట్రీలోకి వచ్చా.. బిగ్‏బాస్ టైటిల్ నాకు చాలా ముఖ్యం.. సోహైల్ ఆవేదన
Follow us on

Big Boss Season 4: ఓపిక టాస్క్‏లో అభిజిత్ ఎలాంటి ఎక్స్‏ప్రెషన్స్ ఇవ్వకుండా ఉండడంతో పూర్తిగా ఓడిపోయాడు. కానీ హౌస్‏లో అందరిని నవ్వించాడు. కాగా ఈ టాస్క్‏లో ఒక్క ఎక్స్‏ప్రెషన్ కూడా ఇవ్వకుండా సోహైల్ గెలిచాడు. దీంతో అతడు ప్రేక్షకులతో మాట్లాడే అవకాశాన్ని అందుకున్నాడు. ” 18 సంవత్సరాలకే ఇండస్ట్రీలోకి వచ్చాను. పదేళ్ళు గడుస్తున్నా ఇంకా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‏బాస్ టైటిల్ కొట్టాలన్నదే నా లక్ష్యం. నా కోపం మీకు నచ్చకపోతే క్షమించండి. కానీ నేను మీ మనసుల్లో ఉండిపోవాలి” అని ప్రేక్షకులను కోరుకున్నాడు. తన కోపమే తనకు మైనస్ అని, కానీ ఆ కోపం ఊరికే రాదని స్పష్టం చేశాడు. అరియానాకు చిన్న సమస్య అనిపించినా నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని వాపోయాడు. ఇక ఆమెతో జరిగిన గొడవను అక్కడితో వదిలేస్తానని చెప్పాడు.

సోహైల్‏కు దైర్యం చెప్పిన బిగ్‏బాస్:

ఇక ప్రేక్షకులతో సోహైల్ తన గురించి చెప్పాక బిగ్‏బాస్‏తో తన ఆవేదన చెప్పుకున్నాడు. నిజంగా బిగ్‏బాస్‏ నేను కావాలని చేయలేదు. ఈ గేమ్ నాకు చాలా ఇంపార్టెంట్. నాకు ఎలా మాట్లాడాలో తెలియదు అంటూ ఎమెషనల్ అయ్యాడు. అయితే ఆఖరుగా బిగ్‏బాస్‏… సోహైల్‏కి మీరు మీ ఆటను ఇలాగే ఆడుతూ.. మీ లక్ష్యం వైపు కొనసాగండి అని చెప్పి దైర్యం నింపి పంపించాడు. ఇక బయటకు వచ్చిన తరువాత సోహైల్.. అరియానాతో జరిగిన గొడవపై అఖిల్, మోనాల్ దగ్గర గుర్తు చేసుకొని ఏడ్చేశాడు. మొత్తానికి బుధవారం ఎపిసోడ్‏లో అరియానా, సోహైల్ మధ్య జరిగిన గొడవ హైలైట్ అయ్యింది.