ఆ కంటెస్టెంట్‏కు హౌస్‏లో ఉండే అర్హత లేదు.. బిగ్‏బాస్ ఇంట్లో కట్టప్ప ఆమెనే.. గుట్టు బయటపెట్టేసిన అవినాష్..

|

Dec 10, 2020 | 10:55 AM

బిగ్‏బాస్ నుంచి గతవారం ఎలిమినేట్ అయిన అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిగ్‏బాస్ సీజన్ 4 బెస్ట్ ఎంటర్ టైనర్ ఆఫ్ హౌస్‏లో పేరొందిన అవినాష్ సడెన్ ఎలిమినేషన్ పై చాలానే విమర్శలు వచ్చాయి.

ఆ కంటెస్టెంట్‏కు హౌస్‏లో ఉండే అర్హత లేదు.. బిగ్‏బాస్ ఇంట్లో కట్టప్ప ఆమెనే.. గుట్టు బయటపెట్టేసిన అవినాష్..
Follow us on

బిగ్‏బాస్ నుంచి గతవారం ఎలిమినేట్ అయిన అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిగ్‏బాస్ సీజన్ 4 బెస్ట్ ఎంటర్ టైనర్ ఆఫ్ హౌస్‏లో పేరొందిన అవినాష్ సడెన్ ఎలిమినేషన్ పై చాలానే విమర్శలు వచ్చాయి. అసలు అవినాష్ లేకపోతే హౌస్‏లో ఎంటర్‏టైన్మెంట్ లేదని, అసలు అవినాష్‏ను ఎలా ఎలిమినేట్ చేశారంటూ చాలా కామెంట్స్ వినిపించాయి. ఇక బిగ్‏బాస్ దత్తపుత్రిక కోసం అవినాష్ బలియ్యాడు అనేదాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎలిమినేషన్ అనంతరం రాహుల్ సిప్లిగంజ్‏కి ఇచ్చిన బిగ్‏బాస్ బజ్ ఇంటర్వ్యూలో తన ఎలిమినేషన్‏కి కారణమైన మోనాల్‏పై షాకింగ్ కామెంట్స్ చేశాడు అవినాష్.

అవినాష్ మాట్లాడుతూ.. “నేను బిగ్‏బాస్ హౌస్‏లోకి ఎంటర్ అయినప్పటి నుంచి స్ట్రాంగ్‏గా గేమ్ ఆడాను. నేను తక్కువసార్లు నామినేష్స్‏లోకి వచ్చాను. కానీ ఇలా సడెన్ ఎలిమినేట్ అయ్యాను. టాప్ 5లో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. అయితే హౌస్‏లో టాస్క్‏ల పరంగా, ఎంటర్ టైన్మెంట్ పరంగా నేను స్ట్రాంగ్, మోనాల్ నాకంటే వీక్ అనిపించింది. మేము మొదటి నుంచి సీరియస్ గా గేమ్ ఆడుతున్నాము కానీ ఆమె లాస్ట్‏లో బాగా ఆడుతున్నా అంటే కరెక్టా.. తాను టాస్క్‏లలో అంత ఎఫర్ట్ పెట్టలేదని తనే చెప్పింది.

మోనాల్ విషయం నాకు ఇప్పటికీ అర్థం కాదు. అప్పుడే ప్రేమ నటిస్తుంది. అప్పుడే గొడవ పెట్టుకుంటుంది. ఆమెను నామినేట్ చేసినప్పుడు ఎదుటివాళ్ళు చెప్పిన రీజన్ తనకు అర్థం అవుతుందో లేదో కూడా తెలియదు. ఒకటి మాట్లాడితే తను వేరేది మాట్లాడుతుంది. సంబంధంలేని టాపిక్‏లోకి వెళ్ళిపోతుంది. నా ప్రకారం బిగ్‏బాస్ రాజ్యంలో రాణి అవ్వడానికి మాత్రం అర్హతలేనిది మోనాల్‏కి మాత్రమే. రాజు అంటే సోహైల్. వెన్నుపోటు పొడిచేది కూడా మోనాల్. ఆమె బిగ్‏బాస్ ఇంట్లో కట్టప్ప.. ఎందుకంటే ఆమె వరకు వచ్చినప్పుడు సింపుల్‏గా తప్పుకుంటుంది. అభిజిత్, అఖిల్ మధ్య గొడవలకు తనే కారణం. ఆ విషయం తనకు తెలుసు కానీ మాట్లాడదు. సైలెంట్ గా ఉంటుంది. తన విషయంలో ఇద్దరికి గొడవ అవ్వాలి. టాపిక్ తనదే అవ్వాలి. ఇదే ఆమె గేమ్ ప్లాన్. అందుకే ఆమె కట్టప్ప. కానీ ఆమెలో ఒకటి మంచి విషయం ఉంది. ఇంట్లో ఎవరికి బాలేకపోయినా… టాబ్లెట్ ఇవ్వడం.. తిండి పెట్టడం లాంటివి చేస్తుంది. హెల్త్ విషయం కేర్ తీసుకుంటుంది” అంటూ అవినాష్ చెప్పాడు.