Big Boss 4: బొమ్మ తెచ్చిన లొల్లి.. సిగ్గుండాలి అంటూ అరియానాపై రెచ్చిపోయిన సోహైల్..

|

Dec 10, 2020 | 7:01 AM

బిగ్‏బాస్ ఇచ్చినా ఓపిక టాస్క్‏లో తన చింటూ బొమ్మను మోనాల్ బయటకు విసిరేయడంతో టాస్క్ అనంతరం ఆమెపై మాటలతో విరుచుకుపడింది అరియానా.

Big Boss 4: బొమ్మ తెచ్చిన లొల్లి.. సిగ్గుండాలి అంటూ అరియానాపై రెచ్చిపోయిన సోహైల్..
Follow us on

బిగ్‏బాస్ ఇచ్చినా ఓపిక టాస్క్‏లో తన చింటూ బొమ్మను మోనాల్ బయటకు విసిరేయడంతో టాస్క్ అనంతరం ఆమెపై మాటలతో విరుచుకుపడింది అరియానా. అనంతరం మోనాల్ గుక్క పెట్టి ఏడవడంతో బిగ్‏బాస్ తనను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇక ఓపిక టాస్క్‏లో పాల్గోన్న సోహైల్ పై అరియానా ప్రశ్నల వర్షం కురిపించింది. తన బొమ్మను పాడు చేయాలనుకున్నావంటూ, చింటూను నీళ్ళలో పడేసి నా ఎమోషన్‏తో ఆడుకున్నావంటూ చాలా మాట్లాడింది. అరియానా వేసిన ప్రశ్నలకు టాస్క్‏లో సోహైల్ సమాధానాలు ఇవ్వలేకపోయాడు. టాస్క్ అనంతరం సోహైల్ అరియానా వద్దకు వచ్చి నువ్వు చేస్తే ఒప్పు , మేము చేస్తే తప్పా అంటూ నిలదీశాడు. మోనాల్ పై గుడ్డు కొట్టినప్పుడు నీకు ఎమి అనిపించదు కానీ మేము నీ బొమ్మను పట్టుకుంటే తప్పా అంటూ అరియానాను కడిగేశాడు. దీంతో అరియానా నాతో పెట్టుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చింది.

అరియానా వార్నింగ్‏తో సోహైల్ మరింతగా రెచ్చిపోయాడు. తన సహానాన్ని కోల్పోయి తొక్కలో బొమ్మ కోసం నిన్ను అంత బాగా చూసుకున్న అవినాష్‏నే ఏడిపించావు. నువ్వు మాట్లాడకు, సిగ్గుండాలి అంటూ అరియానాపై విరుచుకుపడ్డాడు. బేబి కేర్ టాస్క్‏లో నన్ను ఎంత టార్చర్ పెట్టావు అంటూ నిలదీయగా, నేను తప్పు చేస్తే ఇక్కడ ఎందుకుంటాను? అంటూ అరియానా కూడా గొడవకు దిగింది. దీంతో సోహైల్ అగ్రెసివ్ బిహేవియర్ నేను తీసుకోలేకపోతున్నా అంటూ, తన ఎమోషన్స్‏తో ఆడుకుంటున్నారంటూ కింద పడి మరి ఏడ్చేసింది. దీంతో అభి ఆమెను ఓదార్చాడు. తర్వాత మోనాల్ కూడా అరియానాను ఓదార్చేందుకు దగ్గరకు వెళ్ళగా.. నాకు రియాలిటీ అర్థమైందంటూ అరియానా దండం పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయింది.