అఖిల్‌పై మోనాల్ కామెంట్స్… పులిహోర కలపడం తగ్గించమని సలహా… చులకన చేసి మాట్లాడిన అఖిల్….

మోనాల్ నవ్వతూ అఖిల్‌ను పులిహోర కలపడం తగ్గించుకో అని సలహా ఇచ్చింది. దీంతో అఖిల్ సీరియ‌స్ అయ్యాడు. ఒక‌మ్మాయిని ఫ్రెండ్‌గా తీసుకుంటే త‌ప్పేమీ కాద‌ని అఖిల్ అన్నాడు.

అఖిల్‌పై మోనాల్ కామెంట్స్... పులిహోర కలపడం తగ్గించమని సలహా... చులకన చేసి మాట్లాడిన అఖిల్....
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 11, 2020 | 7:40 AM

బిగ్‌బాస్ హౌస్‌లో మోనాల్, అఖిల్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. అదంతా స్క్రీన్ స్పేస్ కోసమే అని కూడా తెలుసు. మోనాల్ కారణంగా అభి, అఖిల్ మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే అభి మోనాల్ నుంచి దూరం ఉన్నా అఖిల్ మాత్రం అభిపై సందర్భం వచ్చిన ప్రతీసారి పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అఖిల్‌తో మాట్లాడుతూ మోనాల్ ఒక సలహా ఇచ్చింది. దీంతో అఖిల్ హర్ట్ అయ్యాడు.

పులిహోర కలపడం తగ్గించు…

మోనాల్ నవ్వతూ అఖిల్‌ను పులిహోర కలపడం తగ్గించుకో అని సలహా ఇచ్చింది. దీంతో అఖిల్ సీరియ‌స్ అయ్యాడు. ఒక‌మ్మాయిని ఫ్రెండ్‌గా తీసుకుంటే త‌ప్పేమీ కాద‌ని అఖిల్ అన్నాడు. ఆ తర్వాత పులిహోర అంటూ సోహైల్ సైతం అఖిల్ ‌పై పాట‌లు పాడాడు. నేనేదో చేసేస్తున్నా అన్నట్లుగా మాట్లాడుతున్నావ‌ని మోనాల్ మీద అఖిల్ ఫైర్ అయ్యాడు. దీంతో మోనాల్ నీవు మొద‌టి నుంచి ఫ్లర్టింగ్ చేస్తున్నావు. కానీ, ఈ మ‌ధ్య కొంచెం ఎక్కువైందని అంది. అది చూడ‌టానికి బాగోలేదు అని ఉన్నమాట‌ చెప్పింది. నిన్ను ఏదో బ్యాడ్ చేయ‌డానికి ఇలా చెప్పట్లేద‌ని స్పష్టం చేసింది. కానీ అఖిల్ మాత్రం ఆమె మాట‌ల‌తో ఏకీభ‌వించ‌లేదు. ‘నేను అంద‌రి ముందే మ‌జాక్ చేస్తున్నాను అంతే, నీకు త‌ప్పుగా అనిపిస్తే నాకు చెప్పకు, నాతో మాట్లాడ‌కు’ అని దురుసుగా మాట్లాడ‌టంతో మోనాల్ హ‌ర్టై అక్కడ నుంచి వెళ్లిపోయింది. నీతో టైమ్ స్పెండ్ చేయాల‌ని ఉంద‌ని మోనాల్ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టింది. అలా అనిపిస్తే ఎక్కడో మూల‌న ఎందుకు కూర్చుంటావు, నువ్వే వ‌చ్చి నా ప‌క్కన కూర్చో అని ప‌ట్టింపు లేన‌ట్లుగా మాట్లాడాడు. దీంతో అఖిల్ అన్న మాటలకు మోనాల్ బాధపడింది.