ఏంటి షాక్ అయ్యారా..? నిజంగా.. స్వయానా.. ఇవి బిగ్‌బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ చెప్పిన మాటలు. బిగ్‌బాస్ 3 టైటిల్ విన్నర్‌గా.. అనూహ్యంగా.. అత్యధిక ఓట్ల మెజార్టీతో.. రాహుల్ బిగ్‌బాస్ 3 విజేతగా నిలిచాడు. ఎంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న శ్రీముఖిని సైతం వెనక్కి నెట్టి.. టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అనంతరం టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తిర విషయాలను బయటపెట్టాడు.
ముందు నుంచీ నేను సాంగ్ వీడియోస్ తీయడం ప్లస్ అని.. నాకు మొదటినుంచీ.. యూట్యూబ్‌కి 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని ఇంటర్య్యూలో చెప్పాడు రాహుల్. దాంతో పాటుగా.. బహుశా ఎలక్షన్స్ టైంలో.. వైఎస్ జగన్ గారికి నేను పాట పాడానని.. ఒకవేళ అదే ప్లస్ పాయింట్ అయి ఉండొచ్చని.. ఈ విషయం నాకు కూడా తెలీదని.. హౌస్ నుంచి బయటకు రాగానే.. అందరూ చెబుతున్నారని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా.. ఏపీ నుంచి కూడా నాకు బాగా సపోర్ట్ లభించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయినట్టు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. నేను బయట ఎలా ఉన్నానో.. ఇంట్లో కూడా అలానే ఉన్నాని.. దాంట్లో ఎలాంటి మార్పులు లేవని అన్నాడు రాహుల్. అయితే.. గత మూడు వారాల క్రితం నుంచి.. సీఎం జగన్ అభిమానులు.. ఫ్యాన్స్ అంతా ఓ గ్రూపులా ఏర్పడి.. రాహుల్‌కి ఓట్లు వేసి మద్దతు తెలిపారట. అందుకనే.. భారీ మెజార్టీ ఓట్ల తేడాతో.. రాహుల్ విన్ అయినట్టు సమాచారం.
Thanks for the song on our Leader @Rahulsipligunj bhai ?
All the best for your future !! ?Just rock with your voice pic.twitter.com/j5YtwM4ZDZ
— Manvitha Chinnu (@ManviDad) November 6, 2019