‘బిగ్ బాస్’ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ అతడే.. కత్తి మహేష్ జోస్యం!
సినీ విమర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అక్కర్లేని వ్యక్తి కత్తి మహేష్. ఓ న్యూస్ ఛానల్‌లో రివ్యూస్ రాస్తూ ప్రసిద్దిగాంచిన ఈయనకు… ‘బిగ్ బాస్’ సీజన్ 1లో అవకాశం రావడంతో వ్యవహారమే మారిపోయింది. అంతవరకు కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఆయన.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. అంతేకాదు మొన్నీమధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఫేమస్ కూడా అయ్యాడు. ఇది ఇలా ఉండగా కత్తి మహేష్ తాజాగా ‘బిగ్ బాస్’ సీజన్ […]
సినీ విమర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అక్కర్లేని వ్యక్తి కత్తి మహేష్. ఓ న్యూస్ ఛానల్‌లో రివ్యూస్ రాస్తూ ప్రసిద్దిగాంచిన ఈయనకు… ‘బిగ్ బాస్’ సీజన్ 1లో అవకాశం రావడంతో వ్యవహారమే మారిపోయింది. అంతవరకు కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఆయన.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. అంతేకాదు మొన్నీమధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఫేమస్ కూడా అయ్యాడు.
ఇది ఇలా ఉండగా కత్తి మహేష్ తాజాగా ‘బిగ్ బాస్’ సీజన్ 3 గురించి స్పందించాడు. ఇటీవలే యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా ‘బిగ్ బాస్’ నిర్వాహకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కత్తి మహేష్ ఫేస్‌బుక్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ‘2017 లో.. బిగ్ బాస్ టీం వాళ్లు 70 రోజుకు సెక్స్ లేకుండా ఉండగలరా అని నన్ను ప్రశ్నించారు. దానికి నేను ‘బాత్రూమ్ లో కెమెరాలు ఉండవుగా! పర్లేదు మ్యానేజ్ చేసుకుంటాను’ అని సమాధానమిచ్చాను. ఇదే ప్రశ్న, ఇదే టీం యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయిని ఇప్పుడు 2019లో అడిగితే…తప్పైపోతుందా?!? జస్ట్ ఆస్కింగ్!” అంటూ ఆయన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
మరోవైపు ‘బిగ్ బాస్’ సీజన్ -3లో మొదటి వారం ఎవరు ఎలిమినేట్ ఎవరు అవుతారనే దానిపై కూడా కత్తి మహేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘నోరుజారినోళ్లు మొదటివారంలోనే ఎలిమినేట్ అవుతారు. బిగ్ బాస్ సీజన్ 1లో జ్యోతి, రెండో సీజన్‌లో సంజనలాగే.. ఈ సీజన్‌లో సింగర్ రాహుల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని” కత్తి మహేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.