బిగ్ బాస్ హౌస్ నుంచి అశురెడ్డి ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం సరదాగా సాగిన ఎపిసోడ్ ఎండింగ్‌కి అశు రెడ్డి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. అషురెడ్డిని హౌస్ మేట్స్ అంతా కలిసి సరదాగా పాటలు పాడుతూ సెండ్ ఆఫ్ పలికారు. హౌస్ లో సున్నితంగా వ్యవహరించి, కలుపుగోలుగా ఉన్న అషు ఎలిమిేనేట్ అవుతుందని ముందుగానే అందరూ భావించారు. గత వారం రోజుల నుంచి అషురెడ్డి తన హాట్ డ్యాన్సులతోనూ కాస్త దుమ్ము రేపినా అప్పటికే సమయం మించిపోయింది.