బుల్లితెర సంచలనం బిగ్‌బాస్ షో రసవత్తరంగా కొనసాగుతోంది. కంటెస్టెంట్లల మధ్య గొడవ, బిగ్‌బాస్‌లు ఇచ్చే టాస్క్‌లు, వారి చిలిపి చేష్టలు ఇలా పలు విషయాలు ప్రేక్షకులను షోకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. కాగా ఇంత రసవత్తరంగా సాగుతున్న ఈ షోలోకి ప్రముఖ యాంకర్, జబర్దస్త్ కంటెస్టెంట్ సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అయితే అతడు షోలో కంటిన్యూ అయ్యేందుకు కాదు.
సుధీర్ హీరోగా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా బిగ్‌బాస్‌లోకి సుధీర్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కడికి వెళ్లనున్న సుధీర్.. కంటెస్టెంట్‌లకు టాస్క్‌లను కూడా సిద్ధం చేసుకున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో ప్రభాస్ సహా పలువురు సినీ ప్రముఖులు తమ సినిమాలను బిగ్‌బాస్‌లో ప్రమోట్ చేసుకోనుందేకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.