తెలుగు బిగ్‌బాస్ సీజన్-3 ప్రజల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచీ వివాదాల నడుమ.. ఈ షో.. ఎలా ఉంటుందో.. ఎలా సాగుతుందో.. అనేది జనాల్లో ఆసక్తిని రేకిత్తించింది. దీనికి నాగార్జున యాంకరింగ్ కూడా హైలెట్ అనే చెప్పాలి. బిగ్‌బాస్ మూడు సీజన్స్‌లో ఎన్టీఆర్, నానిల కంటే.. నాగార్జున చేస్తోన్న బిగ్‌బాస్-3 సీజన్‌కు రేటింగ్ కూడా ఎక్కువ వచ్చిన విషయం విదితమే. అయితే.. ఈ షోలో నాగ్‌తో మరో హైలెట్ ఏంటంటే.. పండు. కింగ్.. నాగార్జున ముద్దుగా.. పండూ.. అని పిలుచుకునే చిన్న కోతి బొమ్మ. మొదటి నుంచీ.. దీన్ని షోలో భాగంగా తీసుకొచ్చారు. అప్పుడప్పుడూ మర్చిపోయినా.. మధ్య మధ్యలో కనిపిస్తూ.. జోక్స్ వేస్తూ ఉండేది. అయితే.. ఆదివారం ఎలిమినేషన్ రౌండ్‌లో మాత్రం ‘పండు’ అసలు కనిపించలేదు.. అసలు నాగ్.. దాని ఊసే తీసుకురాలేదు. దీంతో నెటిజన్లు.. నాగ్.. పండు ఎక్కడ..? అంటూ ప్రశ్నలు వేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు.