తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 నాలుగు వారాలు ముగించుకుని.. ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే హేమ, జాఫర్, తమన్నా, రోహిణిలు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఐదవ వారం రసవత్తరంగా సాగుతోంది. ఇకపోతే ఈ వారంలో ఎలిమినేషన్స్‌కు ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. వీరిలో సింగర్ రాహుల్ సిఫ్లిగంజ్ – పునర్నవి – బాబా భాస్కర్ – మహేష్ విట్టా – హిమజ – అషు – శివజ్యోతి ఎలిమినేషన్ లో ఉన్నారు. కాగా వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని పరిశీలిస్తే.. సోషల్ మీడియా ట్రెండ్ ప్రకారం రాహుల్ సిప్లిగంజ్, అషు రెడ్డిల్లో ఒకరు బయటికి వెళ్తారని టాక్ నడుస్తోంది.
హౌస్‌మేట్స్ అందరూ కూడా ఈవారం రాహుల్‌ని నామినేట్ చేయడం.. అటు అషురెడ్డి కూడా పెద్దగా టాస్క్‌ల్లో ఆసక్తి చూపించకపోవడం.. అవే వ్యూయర్స్‌కు వీరిని ఎలిమినేట్ చేయడానికి కారణాలు అయ్యాయి. కాగా అషురెడ్డి సీరియస్‌నెస్ లేకుండా హౌస్‌లో మొక్కుబడిగా ఉన్నట్టుగా ఆమె వ్యవహారం కనిపిస్తోంది. అందుకే ఈ వారం అషురెడ్డి ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.