Big News Big Debate: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’లో పాత పగలు ఇప్పుడు తీర్చుకుంటున్నారా?

|

Oct 08, 2021 | 9:24 PM

మాలో ఉన్న సభ్యులు 951. అందులో ఓట్లు వేసేది మహా అయితే 4వందల నుంచి 5వందల మంది. దీనికే ఎందుకు ఇంతగా ఆవేశకావేశాలకు పోతున్నారు. ఏకగ్రీవం చేసుకోలేక తెగ హైరానా పడుతోంది

Big News Big Debate: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాలో పాత పగలు ఇప్పుడు తీర్చుకుంటున్నారా?
Big News Big Debate
Follow us on

MAAలో పాత పగలు ఇప్పుడు తీర్చుకుంటున్నారా?
US డీల్‌లో MAAకు దక్కిదెంత? నొక్కిందెంత?
నిధుల దుర్వినియోగంపై లెక్కలు తేలాయా?
మాజీ అధ్యక్షుడు నాగబాబుకు రిటర్న్‌గిఫ్ట్‌ ఇచ్చారా?

Big News Big Debate – MAA:మాలో ఉన్న సభ్యులు 951. అందులో ఓట్లు వేసేది మహా అయితే 4వందల నుంచి 5వందల మంది. దీనికే ఎందుకు ఇంతగా ఆవేశకావేశాలకు పోతున్నారు. ఏకగ్రీవం చేసుకోలేక తెగ హైరానా పడుతోంది ఇండస్ట్రీ. ఈ పదవుల్లో మనీ మేటర్స్‌ ముడిపడి ఉంటాయా? బాధ్యతగా కాకుండా అందులో ఉండే లాభాలను… హోదా ఇచ్చే ప్రివిలేజెస్‌ ను వాడుకోవడానికే ఇంతగా తహతహలాడుతున్నారా? గతంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని బయటవాళ్లు అనలేదు. వాళ్లలో వాళ్లే ఆరోపించుకున్నారు. ఆనాటి అంశాలు ఈనాడు తెరమీదకు ఎందుకు వస్తున్నాయి.

మా… ఇంటిగుట్టు బయటపడింది. అంతా ఒక్కటే అనేవి మాటలే. ఎన్నికలు వస్తే కానీ వారిలో అసలు కోణం బయటపడ లేదు. గత ఎన్నికల్లో రెండు వర్గాలు ఉండేవట అని మాత్రమే వినిపించింది. కానీ ఇప్పుడు ఉన్నాయి.. మీరు ఈ వర్గమా? ఆ వర్గమా? అంటూ బాహటంగానే చర్చకు పెట్టారు. ఇందులో కులం, మతం, ప్రాంతం, భాష అన్నీ వచ్చేశాయి. దాచుకోవడానికి ఏమీ లేదు. సాధారణ ఎన్నికలను మించిపోయాయి.

MAA అనేది మా సొంతం. వంద అనుకుంటాం. తర్వాత కలుసుకుంటాం అంటారు. కానీ కలుసుకోలేనంత గ్యాప్‌ పెరుగుతోంది. బయట వ్యక్తులు, శక్తులు కూడా జోక్యం చేసుకుంటున్నాయి. కుల, మత, రాజకీయాల కోణాలపై చర్చకు పెడుతూ ఎవరికి వారు బయటి నుంచే మద్దతు ప్రకటిస్తున్నారు. హేతువాదులు, మోదీ వ్యతిరేక శక్తులు ప్రకాష్‌రాజ్‌కు జై కొడుతుంటే.. మరో వర్గం మంచు ప్యానల్‌ మంచి ప్యానల్‌ అంటూ రంగంలో దిగింది. ఇండస్ట్రీలో చీలికే వచ్చిందంటూ పెద్దలే ప్రకటించుకున్నారు.

ఈ ఎన్నికల్లో మరోసారి పాత పగలు కూడా తెరమీదకు వస్తున్నాయి. ప్రకాష్‌రాజ్‌ ప్యానల్‌లో శ్రీకాంత్‌ పోటీచేయడానికి కారణం మంచు విష్ణుకు నరేష్‌ మద్దతు ఇవ్వడమంటున్నారు. గతంలో వీరి మధ్య పాత పగలున్నాయి. గత ఎన్నికల్లో శివాజీరాజా, నరేష్‌ మధ్య హోరా హోరి పోరు సాగింది. అప్పుడు కమిటీలో శ్రీకాంత్‌ కూడా కీలకంగా ఉన్నారు. శివాజీ రాజా, శ్రీకాంత్‌లపై నరేష్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. నిధులు పక్కదారి పట్టాయన్నారు. తర్వాత పెద్దల సమక్షంలో కలిసినట్టు కనిపించినా.. మరోసారి వారి మధ్య వైరం తాజా ఎన్నికలతో బయటపడింది. శ్రీకాంత్‌ మంచు ఫ్యామిలీకి వ్యతిరేకంగా పోటీలో నిలిచారు. నిజంగానే ఈ ఎన్నికల్లో పాత పగలు ఉన్నాయా? లేకుంటే యాదృశ్చికంగా జరిగిందా?

శివాజీరాజాకు మా తో అనుబంధం
2004-06 జనరల్ సెక్రటరీ ( అప్పుడు అధ్యక్షులు-మోహన్ బాబు)
2015-17 జనరల్ సెక్రటరీ (అప్పుడు అధ్యక్షులు-రాజేంద్రప్రసాద్)
2010-12 ట్రెజరర్ ( అప్పుడు అధ్యక్షులు-మురళీమోహన్)
2013-15 ట్రెజరర్ ( అప్పుడు అధ్యక్షులు-మురళీమోహన్)
2017-19 అధ్యక్షులుగా ఏకగ్రీవం ( అప్పుడు జనరల్ సెక్రటరీ-నరేష్)
2019లో అధ్యక్షుడిగా పోటీ, నరేష్ చేతిలో ఓటమి
పోలైన ఓట్లు 472, శివాజీ రాజాకు-199, నరేశ్‌కు -268, చెల్లనవి-5
69 ఓట్ల ఆధిక్యంతో నరేశ్‌ గెలుపు
రెండు సార్లు జనరల్ సెక్రటరీ, రెండు సార్లు ట్రెజరర్, ఒకసారి అధ్యక్షులు
మురళీమోహన్ తర్వాత 10 ఏళ్లకు పైగా మాలో ఉన్న ఏకైక వ్యక్తి

గతంలో శివాజీ రాజా మాలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలపై తొలిసారిగా టీవీ9 స్టూడియో బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో గొంతు విప్పారు. పలు రాజీ ఫార్ములాలు ఆయన మా ముందుంచారు.. పూర్తి వివరాల కోసం కింద వీడియో క్లిక్‌ చేయండి.

Read also: TDP: తాలిబన్స్ టు తాడేపల్లి అంటూ టీడీపీ తీవ్ర ఆరోపణలు.. ఏపీలో హైఓల్టేజ్‌కి చేరిన పొలిటికల్ డ్రగ్ వార్.!