Big News Big Debate: కేంద్రంపై విపక్షాల దండయాత్ర వ్యూహమేంటి? కత్తులు దూసుకునే పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా?

తెలంగాణలో 19 పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి కేంద్ర, రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పాయి. 11 డిమాండ్లతో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపట్టిన పార్టీలు.. 27న భారత్ బంద్‌లోనూ పాల్గొంటున్నాయి.

Big News Big Debate: కేంద్రంపై విపక్షాల దండయాత్ర వ్యూహమేంటి? కత్తులు దూసుకునే పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా?
Big News Big Debate


కేంద్రంపై విపక్షాల దండయాత్ర వ్యూహమేంటి?
కత్తులు దూసుకునే పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా?
2024లో అపోజిషన్‌ను చిత్తు చేసే BJP ప్లానేంటి?
తెలుగు రాష్ట్రాల్లోనూ ఐక్యతారాగం కలిసొస్తుందా?

తెలంగాణలో 19 పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి కేంద్ర, రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పాయి. 11 డిమాండ్లతో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపట్టిన పార్టీలు.. 27న భారత్ బంద్‌లోనూ పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా 20కిపైగా ప్రధాన పార్టీలు రైతు చట్టాలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్‌కు పిలుపు ఇచ్చాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్యాచరణకు పరిమితం కాకుండా 2024 సాధారణ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

దేశవ్యాప్తంగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రధాన పార్టీలు లీడ్‌ తీసుకుని మరీ బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నాయి. తమిళనాడులో అధికార DMK కేంద్ర విధానాలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించగా.. తెలంగాణలో కాంగ్రెస్‌ పెద్దన్నపాత్ర పోషిస్తోంది. ఈ నెల27న భారత్‌బంద్‌కు కూడా పిలుపునిచ్చింది. NDAయేతర పార్టీలు మద్దతు ఇవ్వగా తటస్థంగా ఉండే రాజకీయ పార్టీలు ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. బీజేపీని గద్దె దించేవరకు పోరాటం కొనసాగుతుందంటున్నారు నాయకులు.

ఆపరేషన్‌ 2024 ఇదేనా?
దేశ‌ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక కూట‌మిని కూడ‌గ‌ట్టే ప‌నిలో కాంగ్రెస్ బిజీ అయింది. ఇందుకు ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉంది. కేంద్రంలో తిరుగులేని నేత‌గా ఉన్న ప్రధాని మోదీ ఇమేజ్‌ను త‌గ్గించ‌డానికి, బీజేపీని ఓడించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న విపక్షాలను ఏకం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాహుల్‌ బ్రేక్‌ ఫాస్ట్‌ మీట్‌ పెట్టి మరీ విపక్షాలకు కలిపే ప్రయత్నం చేశారు. తాజాగా మూడు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారత్‌ బంద్‌ పిలుపు, ప్రైవేటీకరణ అంశాలను అనుకూలంగా మలుచుకుని ఐక్య కార్యాచరణతో వస్తున్నారు. ఇదంతా మిష‌న్ 2024లో భాగంగానే అంటున్నారు. ప్రాంతీయ పార్టీల‌ను ఏకం చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గుజరాత్ ఎన్నికల్లో విపక్షాలతో జట్టుకట్టి బీజేపీ ప్రభావం తగ్గేలా చేసి.. చివరకు 2024లో అధికారం నుంచి దింపాలన్నది ప్లాన్‌.

ఇంతకీ ఎవరు ఎటు ఉన్నారంటే…

బీజేపీ వ్యతిరేక కూటమిలో…
కాంగ్రెస్‌, TMC, DMK, NCP, శివసేన, RJD, సమాజ్‌వాది, JMM, నేషనల్ కాన్ఫరెన్స్, లెఫ్ట్‌, IUML, RSP, కేరళ కాంగ్రెస్, LJD, JDS

NDA కూటమి
BJP, అకాళీదల్‌, అప్నాదల్‌, JDU, AIDMK, రిపబ్లికన్ పార్టీ

తటస్ధ పార్టీలు
YCP, TRS, TDP, BSP, MIM, BJD, AAP

ఇక తెలుగురాష్ట్రాల పార్టీలు మాత్రం భిన్నంగా ఉన్నాయి…

TRS వెర్షన్‌…
BJP, కాంగ్రెస్‌కు సమదూరం
అంశాలవారీగా NDAకు మద్దతు
రాజకీయంగా శత్రుత్వం

YCP వెర్షన్‌…
BJP, కాంగ్రెస్‌కు సమదూరం
అంశాలవారీగా NDAకు మద్దతు
రాజకీయంగా శత్రుత్వం

TDP ఆలోచన…
కాంగ్రెస్‌-లెఫ్ట్‌ ఉద్యమాలకు మద్దతు
పొత్తులపై ఎటూ తేల్చుకోలేని స్థితి
వేచిచూసే ధోరణి

NDA కూటమి సవాళ్లు…

బీజేపీని ఓడించాలన్న లక్ష్యం ఒకే కానీ నాయకత్వం చుట్టూనే సమస్యలు ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్‌తో ట్రావెల్‌ అవుతున్న TMC కూడా రాహుల్‌ కంటే మమతనే మోదీకి ధీటైన అభ్యర్ధి అంటూ తమ సొంత పత్రికలో కథనం రాసింది. అటు DMK వంటి స్ట్రాంగ్‌ పార్టీలు కూడా రాహుల్‌ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి లేదంటున్నారు విశ్లేషకులు. లెఫ్ట్‌ పార్టీలతో TMC, కాంగ్రెస్‌ల వైరం కూడా సవాలే. మొత్తానికి పార్లమెంట్‌ సమావేశాల్లో.. ఉద్యమాల్లో కలిసి సాగుతున్న పార్టీలు ఎన్నికల్లో కూడా ఏకమవుతాయా? – బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… వీడియో కోసం కింద లింక్‌ క్లిక్‌ చేయండి.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu