తెలంగాణలో పోలరైజేషన్ పాలిటిక్స్‌లో ఎవరు ఛాంపియన్?
మెజార్టీ వర్గాలే బీజేపీ ఓటుబ్యాంకా?
సీఎం కేసీఆర్‌ను మించిన హిందువు లేరా?
భాగ్యలక్ష్మి అమ్మవారి క్రెడిట్ హస్తానిదా?
12శాతం ఉన్న మతం ఒక్కటై 5 సీట్లు గెలిస్తే.. 80శాతం ఉన్న హిందువులంతాఏకమైతే అధికారంలోకి రాలేమా? పాదయాత్రలో బండి సంజయ్ ప్రధానంగా ఈ నినాదమే వినిపిస్తున్నారు. అయితే ఇది దేశద్రోహమంటూనే కేసీఆర్ ను మించిన హిందువు ఎవరని అధికార TRS పార్టీ ప్రశ్నిస్తోంది. అటు కాంగ్రెస్ కూడా బాగ్యలక్ష్మి టెంపుల్ క్రెడిట్ మాదే అంటూ తెలంగాణలో హిందూ ఛాంపియన్ రేస్లో ఎంటరైంది..
తెలంగాణలో హిందూఛాంపియన్ కోసం పార్టీలు పోటీపడుతున్నాయి. ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న యాత్రలో హిందూ జపం చేస్తున్నారు. మెజార్టీ వర్గాలకు చెందిన పార్టీగా చెబుతున్న బండి… హిందువులకు కొమ్ముకాస్తామని.. ఆలయాలకు, దేవతలకు అవమానం జరిగితే సహించేది లేదంటున్నారు. 12శాతం ఉన్న మైనార్టీలు బీహార్‌లో ఒక్కటై 5 సీట్లు గెలిస్తే… తెలంగాణలో 80శాతం ఉన్న హిందువులు ఏకమైతే కాషాయ జెండా ఎగురుతుందంటున్నారు. యాత్రలో MIM టార్గెట్‌గా హిందూత్వ ఎజెండాను వినిపిస్తున్నారు. గెలుపుకు మతం చాలు… పథకాలు అవసరం లేదన్నది ఆయన ఉద్దేశం.
బండి వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని గులాబీ దళం ఎటాక్ చేస్తోంది. కేసీఆర్‌ను మించిన హిందువు ఎవరున్నారని ప్రశ్నిస్తోంది. గతంలో సీఎం స్వయంగా చెప్పిన మాటలను .. వేలాది కోట్లతో యాదాద్రి వంటి గుడులు డెవలప్ చేస్తున్న విషయాలను గుర్తుచేస్తున్నారు. 80శాతం హిందువులు ఏకం కావాలని పిలుపు ఇవ్వడం ద్వారా దేశద్రోహానికి పాల్పడుతున్నారని ఆరోపించారు TRS నేతలు.
అటు కాంగ్రెస్ కూడా హిందూత్వ రేసులోకి వచ్చేసింది. తామూ హిందువులమేనని మరిచిపోవద్దంటున్నారు పీసీసీ నాయకులు. భాగ్యలక్ష్మి టెంపుల్‌పై పేటెంట్ ఉన్నట్టు బండి సంజయ్ మాట్లాడటంపై హస్తం పెద్దలు గుస్సా అవుతున్నారు. గతంలో రాజీవ్, సోనియా, రాహుల్ వచ్చి దర్శించుకున్నారని.. అసలు ఆలయంలో పూజలను MIM అడ్డుకుంటే 2012లో దగ్గరుండి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వమే అండగా ఉండి జరిపించిందని గుర్తుచేస్తున్నారు.
అసలు తెలంగాణలో జనాభా రేషియో ఏంటి?
2011 జనాభా లెక్కల ప్రకారం
మొత్తం జనాభా 3 కోట్ల 50లక్షలు
హిందువుల సంఖ్య – 2.99 కోట్లు (85.09%)
ముస్లింలు – 44 లక్షలు (12.69%)
ముస్లిం జనాభా 40 శాతం హైదరాబాద్ నగరంలోనే
క్రైస్తవులు – 4.47 లక్షలు (1.27%)
ఇతరులు – 3,33,704 (0.95%)
మరి పాతబస్తీ కేంద్రంగా చేసుకుని ప్రధాన పార్టీలు కొత్త ఎజెండాతో 2023కి సిద్దమవుతున్నాయా? హిందూత్వ ఎజెండా నిజంగా తెలంగాణలో వర్కువుట్ అవుతుందా?. ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్ డిబేట్ జరిగింది.. పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి..
(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)