Big News Big Debate: భారత్ జోడో యాత్రతో చేతి రేఖలు మారతాయా..? 2023లో విజయంపై రాహుల్‌ ధీమా ఏంటి?

|

Nov 02, 2022 | 8:10 PM

తెలంగాణలో రాహుల్‌ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. కేడర్‌తో పాటు సాధారణ పౌరులు కూడా భారీ ఎత్తున మద్దతు ఇస్తున్నారు. 56వ రోజు యాత్రలో భాగంగా హైదరాబాద్ నగరం దాటి‌ ముత్తంగి వద్దకు చేరుకున్నారు.

Big News Big Debate: భారత్ జోడో యాత్రతో చేతి రేఖలు మారతాయా..? 2023లో విజయంపై రాహుల్‌ ధీమా ఏంటి?
Big News Big Debate
Follow us on

తెలంగాణలో రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. కేడర్‌తో పాటు సాధారణ పౌరులు కూడా భారీ ఎత్తున మద్దతు ఇస్తున్నారు. 56వ రోజు యాత్రలో భాగంగా హైదరాబాద్ నగరం దాటి‌ ముత్తంగి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడే కార్నర్‌ మీటింగ్‌ జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 375 కిలోమీటర్ల దూరం పాదయాత్రలో పాల్గొంటారు రాహుల్‌ గాంధీ. నవంబర్‌ 7న మహారాష్ట్రలోకి జోడో యాత్ర ప్రవేశిస్తుంది.

యాత్రలో భాగంగా రాహుల్‌ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను నేరుగా టార్గెట్‌ చేశారు. మోదీతో కేసీఆర్‌కు డైరెక్ట్‌ యాక్సెస్‌ ఉందంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీపైనా ఘాటు కామెంట్స్‌ చేశారు రాహుల్‌. పరిపాలనలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ఇద్దరూ ఒకటేనని మండిపడ్డారు రాహుల్‌ గాంధీ.

రాహుల్‌ గాంధీ యాత్ర కేవలం ఫిట్‌ నెస్‌ కోసమే అంటూ టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రాజకీయ యాత్ర అయితే ఎన్నికలు జరుగుతున్న గుజరాత్‌ను ఎందుకు స్కిప్‌ చేశారని ప్రశ్నించారు. అయితే గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వం పటిష్టంగా పనిచేస్తుందని.. కొత్తగా ఎన్నిక అయిన పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే చూసుకుంటారంటూ రాహుల్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఫిట్‌నెస్‌ కోసం నడవాల్సిన అవసరమే లేదని.. జిమ్‌కు వెళితే చాలన్నారు రాహుల్‌.

ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలపైనా రాహుల్‌ స్పందించారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని ఇతర పార్టీల్లో డిక్టేటర్‌ షిప్‌ నడుస్తుందన్నారు.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో కింద చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..