Big News Big Debate: ఈటల హత్యాయత్నం కుట్ర నిజమేనా? హుజూరాబాద్ ఉప పోరులో సింపతీ పాలిటిక్స్!

Huzurabad By Election: హుజురాబాద్‌లో మాటల యుద్ధం పీక్స్‌కు చేరుతోంది. ఈటల తనపై తాను దాడి చేయించుకుని సింపతీ కొట్టేసే కుట్ర చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్.

Big News Big Debate: ఈటల హత్యాయత్నం కుట్ర నిజమేనా? హుజూరాబాద్ ఉప పోరులో సింపతీ పాలిటిక్స్!
Big News Big Debat

Edited By: Ravi Kiran

Updated on: Oct 02, 2021 | 6:38 AM

Big News Big Debate: హుజురాబాద్‌లో మాటల యుద్ధం పీక్స్‌కు చేరుతోంది. ఈటల తనపై తాను దాడి చేయించుకుని సింపతీ కొట్టేసే కుట్ర చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్. మరోవైపు భాషపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రియల్‌ ఫైటింగ్‌ సీన్లతో హుజూరాబాద్‌ వేడెక్కనుందా. నిజంగానే సింపతి కుట్రలు జరుగుతున్నాయా? లేక ముందే అధికారపార్టీ అలర్ట్‌ అయిందా.? ఉప ఎన్నిక ప్రక్రియ మొదలైన హుజూరాబాద్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం మరోస్థాయికి చేరింది. ప్రచారం అంతా కూడా సినిమా స్టైల్‌లో జరగుతోంది. ఫేక్‌ ఎటాక్‌లు. ప్రచారంలో చేతికి కట్లు. దాడి చేశారంటూ ఆరోపణలు ఇలా రకరకాల ఎత్తులు చూడబోతున్నామా.? అవునంటున్నారు అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు.

మాటలదాకా అయితే వచ్చింది ఈటల రాజేందర్ భారీ కుట్రకు ప్లాన్ చేశారంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్ద బాంబే‌ పేల్చారు. అక్టోబరు రెండోవారంలో సొంత మనుషులతోనే దాడి చేయించుకుని చేతికి కట్లు.. వీల్‌ చైయిర్‌ తో ప్రచారానికి వస్తారంటూ జోస్యం చెప్పారు మంత్రి. పక్కా సమాచారంతోనే చెబుతున్నామంటున్నారు మినిస్టర్. అటు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ సైతం ఇదే ఆరోపణలు చేశారు. తనపై అధికారపార్టీ దాడి చేసిందని… ఊరూరా, ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుక్కుంటారని ఓటర్లు అలర్ట్‌ గా ఉండాలంటున్నారు. గతంలో బండి సంజయ్ ఇలాంటి ట్రిక్‌ ప్లే చేశారని… దుబ్బాక బైపోల్‌లో రఘునందన్ రావు కట్లు కట్టుకుని తిరిగారని.. ఇప్పుడు ఈటల కూడా సానుభూతి ప్రయత్నాల్లో ఉన్నట్టు అంటున్నారు మంత్రి. తనపై తానే దాడి చేయించుకుని సానుభూతి పొందాల్సిన అవసరం తనకు లేదంటున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. కొత్తగా కట్టుకథలు అల్లుకుని వచ్చి ప్రచారం చేస్తుందే TRS పార్టీనే అని తిప్పికొట్టారు.

అంతకుముందు జులై20న తనపై దాడి చేసేందుకు రాష్ట్ర మంత్రి ఒకరు.. మాజీ మావోయిస్టుతో సుపారీ కుదుర్చుకున్నారంటూ ఈటల వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. దీనిపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్… సీబీఐతో అయినా విచారణకు సిద్దమంటూ సవాల్‌ విసిరారు. తాజాగా కొప్పుల వ్యాఖ్యలతో మరోసారి దాడుల అంశం హుజూరాబాద్‌ ఎన్నికల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది.. పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి..


Read Also… Huzurabad By Election: హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలుసా..?