
Big News Big Debate: అసలు విషయం పక్కకు పోయింది. వీధియుద్ధాలు తెరముందుకొచ్చాయి. BJP, TRS కేడర్ మధ్య మాటలు దాటి చేతుల్లోకి రాళ్లు, కర్రలు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్ పర్యటన ప్రకంపనలు రాజ్‌భవన్‌కూ తాకాయి. తమపైనే దాడి చేస్తారా.? ఢిల్లీలో చిట్టా రెడీ చేశామని KCR ఆయన ఫ్యామిలీని జైలుకు పంపిస్తామని బండి సంజయ్ హెచ్చరిస్తుంటే.. ఏడేళ్ల నుంచి ఇదే మాట చెబుతున్నావని కౌంటరిచ్చారు TRS MLA జీవన్‌రెడ్డి. జరుగుతున్న పరిణామాలతో జనాలకు బెంగాల్ రాజకీయాలు గుర్తుకొస్తున్నాయి.
రాళ్ల యుద్ధం. కోడిగుడ్లు, టమాటాలతో పరస్పర దాడులు. అదుపు తప్పుతున్న కేడర్. విరుగుతున్న లాఠీలు. నాయకుల మధ్య సవాళ్లు. ప్రతిసవాళ్లు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూర్యాపేట జిల్లా టూర్‌తో తెలంగాణ అంతటా హైటెన్షన్ నెలకొంది. ముందే అడ్డుకుంటామని ప్రకటించిన గులాబీ శ్రేణులు అడుగడుగునా నిరసనలతో స్వాగతం పలుకుతున్నాయి. పోటీగా కాషాయదళాలు కూడా రోడ్డెక్కడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పలుచోట్ల రాళ్ల దాడులు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనల్లో ఖాకీలూ తీవ్రంగా గాయపడ్డారు
అటు కేడర్ స్ట్రీట్ ఫైట్ చేస్తుంటే.. నేతలు మాటలయుద్ధం తీవ్రతరం చేశారు. బండి సంజయ్‌పై అధికార పార్టీ చేయించిన దాడులేనని కమలదళం ఆరోపిస్తోంది. CM ఆదేశాలతోనే TRS కేడర్ రెచ్చిపోయారని గవర్నర్ తమిళసై కి ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. హుజురాబాద్ ఓటమితో అధికార TRS సహనం కోల్పోయి.. రాష్ట్రంలో భయాందోళన వాతావరణం సృష్టిస్తోందని కాషాయదళం ఆరోపిస్తోంది.
KCRను జైలుకు పంపుతామంటూ తిరుగుతున్నారని.. టచ్ చేసి చూడు బిడ్డా అంటూ గులాబీ శ్రేణులు వార్నింగ్ ఇస్తున్నాయి. బండి కాదు.. గుండాలా మారిన సంజయ్ సంగతి తేల్చుతామంటున్నారు TRS ఎమ్మెల్యేలు. విద్వేషాలు రెచ్చకొడతాం… బెంగాల్ తరహా రౌడీయిజం చేస్తామంటే బట్టలిప్పి కొడతామంటు వార్నింగ్ ఇస్తున్నారు TRS నేతలు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఈనెల 27 వరకు బండి దూకుడు కంటిన్యూ చేయాలని కమలదళం కార్యచరణ సిద్దం చేస్తోంది. అటు పోటీగా TRS కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. మొత్తానికి తెలంగాణలో జనం సమస్యలను కూడా పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుని సొంత ఎజెండాలతో పరస్పర విధియుద్ధాలకు దిగుతున్నాయి.
(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)
ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్ డిబేట్ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.
Also Read:
Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డ లిరికల్ ప్రోమో రిలీజ్..
Ramya Krishna: మెగాస్టార్ సినిమాలో రమ్యకృష్ణ.. కీలక పాత్రలో నటించనున్న శివగామి..