Zodiac Signs: మనిషి అన్న తరువాత ఎప్పుడో ఒకప్పుడు అబద్ధం చెప్పడం సహజం. పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు.. ఆపద్ధర్మంగా కావచ్చు కచ్చితంగా ప్రతి మనిషీ అబద్ధం చెప్పి తీరతాడు. అసలు అబద్ధమే చెప్పని సత్యవంతులు ఈ కలియుగంలో కచ్చితంగా ఉండరు. పైగా అశ్వత్థామా హతః కుంజరః అంటూ శ్రీకృష్ణుడు అంత వాడే ఆపద్ధర్మంగా అబద్ధం చెబితే తప్పులేదని కురుక్షేత్రంలో సెలవిచ్చాడు. అయితే, జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారు అబద్ధాలు యిట్టె చెప్పెస్తారట. కొందరు అబద్ధం చెప్పడం విషయంలో సంకోచంగా చెబుతారట. కొందరు అబద్ధం చెప్పినా అది అతికినట్టు చెప్పలేక దొరికిపోతారట. ఇలా రాశి చక్రాన్ని అనుసరించి అబద్ధాలు చెప్పే లెక్కలు మారుతుంటాయట. మరి ఏ రాశివారి అబద్ధాల లెక్క ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దామా?
వృషభం
వృషభ రాశి వారు సాధారాణంగా అబద్ధాలు చెప్పడానికి సంకోచించే వారిలా కనిపించినా..చెప్పాల్సి వస్తే మాత్రం తమ కుటుంబం..స్నేహితులనూ కూడా ఇరికించే చాన్స్ ఉంటుందట. కానీ, సాద్యమైనంత వరకూ వీరు అబద్ధం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నమే చేస్తారట.
మిథునం
మీలో వారికి నచ్చే విషయం లేకపోయినా మిమ్మల్ని పొగిడేయడంలో మిధున రాశివారు ముందుంటారు. అబద్ధం చెప్పాలని వారు ప్రయత్నించరట. కానీ, అలవోకగా ఎదుటివారిని మెప్పించడానికి సింపుల్ గా అబద్ధం చెప్పెయడంలో వీరు టాప్ ప్లేస్ లో ఉంటారట.
సింహం
వీరు చక్కగా అబద్ధాలు చెబుతారట. గాసిప్స్ చక్కర్లు కొట్టేలా చేయడంలో సింహరాశి వారి తర్వాతే ఎవరైనా ఉంటారని చెబుతారు. సింహరాశివారు అబద్ధానికి చక్కర పూసి మరీ ప్రచారం చేయడంలో సిద్ధ హస్తులుగా ఉంటారట.
కన్య
వారు తమ ఇమేజ్‌ను నిలబెట్టడానికి ఇష్టపడతారు. దానికోసం ఎక్కువ పుస్తకాలు చదువుతారు. ఎవరితోనైనా మాట్లాడే అవకాశం చూపించాలేనపుడు అందంగా అబద్ధం చెప్పి తప్పించుకోవడంలో వీరికి మంచి ప్రావీణ్యం ఉంటుందట. కానీ అనవసర విషయాల్లో అబద్ధం చెప్పే ప్రయత్నం వీరు చేయరు.
తుల
తులా రాశి వారు మీతో గొడవ పడకుండా ఉండటానికి లేదా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండటానికి వారు అబద్ధాలు చెబుతారు. భవిష్యత్తులో మీ ఉనికిని వారు విస్మరిస్తున్నప్పటికీ వారు మీతో ఎంత గొప్ప సమయం గడిపారు అనే దాని గురించి వారు మీకు అందంగా అబద్ధం చెబుతారు.
మేషం
“స్పష్టంగా”, “చాలా సముచితమైనది”, “ఖచ్చితంగా”, మేష రాశివారు అబద్ధం అతికినట్టు చెప్పేస్తారట. వారి వద్ద సమాచారం సున్నా ఉన్నా దానిని చక్కగా చాలా తెలిసి ఉన్న విషయంలా మీకు చెప్పడంలో వారు ఎక్కడా వెనక్కి తగ్గారు. ఏ చర్చలో అయినా సరే వారు ఎప్పుడూ ఓటమి చెందకుండా ఉండాలని ప్రయత్నంలో అలవోకగా అబద్ధాలు చెప్పేస్తారు.
వృశ్చికం
సత్యాన్ని సాగదీయడం అబద్ధం కాదు, అది నిజం కాదని కాదు, స్కార్పియన్స్ నమ్ముతారు. వారు వారి నిజాయితీ ప్రవర్తనను సమర్థిస్తారు, కాని వారు తమ మీద ఉన్నతమైన అనుభూతిని పొందటానికి చిన్న అబద్ధాలను జోడిస్తారు.
కర్కాటకం
“ఇది మీరే కాదు, ఇది నేను” అనేది కర్కాటక రాశి ప్రజలు చెడ్డ వ్యక్తిగా ఉండకుండా ఉపయోగించే క్లాసిక్ లైన్. వారు అబద్ధం చెబుతారు కాబట్టి వారు మిమ్మల్ని బాధించరు. మీతో సంబంధాలను మెరుగ్గా ఉంచుకోవడానికి వారు అబద్ధాలను విరివిగా ఆశ్రయిస్తారు.
ధనుస్సు
వీరు కథలు అల్లడంలో ప్రసిద్దులై ఉంటారు. ఎదో ఒక అబద్ధంతో పరిస్థితుల నుంచి దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తారు. అబద్ధం చెప్పడం వల్ల పెద్ద నష్టం ఏమీ లేదని భావిస్తారు. అందుకే, అబద్ధం చెప్పినందుకు వారేమీ చింతించరు.
మకరం
వీరు అబద్ధాలు ఆడాలని మాత్రం ప్రయత్న పూర్వకంగా కోరుకోరు. తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాన్ని అందంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎదుటివారి మూడ్ బట్టి వీరు అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు.
కుంభం
కుంభం అంటే ఎవరితోనైనా అబద్ధం చెప్పేవారు. వారి అబద్ధాలు ఎలా ఉంటాయంటే.. వారు శాకాహారిగా మీకు చెప్పిన గంటలో మీకు KFC లో కనిపిస్తారు! వీరికి అబద్ధం చెప్పడం విషయంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. సమయానుకూలంగా అబద్ధాలు వీరికి పుట్టేస్తాయి.
మీనం
వీరు అబద్ధం చెప్పి స్నేహం చేయాలని మాత్రం కోరుకోరు. స్నేహితులతో ఓపెన్ మైండెడ్ గా ఉంటారు మీనా రాశి వారు. అబద్ధం చెప్పాల్సి వచ్చినా తరువాత తన స్నేహితులకు నిజం చెప్పే ప్రయత్నం చేస్తారు.