Lucky Zodiac Signs: నాలుగు గ్రహాల రాశి మార్పు.. మార్చి నెలలో వారికి అదృష్ట యోగం

2025 మార్చి నెలలో నాలుగు గ్రహాలు రాశి మారనున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మీన రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న శుక్ర గ్రహం మార్చి నెలంతా వక్ర సంచారం చేయబోతున్నాడు. అలాగే బుధ గ్రహం మీన రాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. ఇక మార్చి 14న రవి మీన రాశిలోకి వెళ్లబోతుండగా, మార్చి ఆఖరులో శని మీన రాశి ప్రవేశం జరుగుతుంది. ఈ నాలుగు గ్రహాల రాశి మార్పు కారణంగా ఆరు రాశుల వారి జీవితాల్లో మార్చి నెలలో తప్పకుండా కొన్ని సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది.

Lucky Zodiac Signs: నాలుగు గ్రహాల రాశి మార్పు.. మార్చి నెలలో వారికి అదృష్ట యోగం
Lucky Zodiac Signs

Edited By: Janardhan Veluru

Updated on: Feb 21, 2025 | 3:29 PM

మార్చి నెలలో నాలుగు గ్రహాలు రాశి మార్పు చెందబోతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మీన రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న శుక్ర గ్రహం మార్చి నెలంతా వక్ర సంచారం చేయబోతున్నాడు. బుధ గ్రహం మీన రాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. ఇక మార్చి 14న రవి మీన రాశిలోకి వెళ్లబోతుండగా, మార్చి ఆఖరులో శని మీన రాశి ప్రవేశం జరుగుతుంది. మొత్తం మీద ఈ నాలుగు గ్రహాల కారణంగా మీన రాశిలో గ్రహాల సంచారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నాలుగు గ్రహాల రాశి మార్పు కారణంగా ఆరు రాశుల వారి జీవితాల్లో మార్చి నెలలో తప్పకుండా కొన్ని సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆ రాశులుః వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం.

  1. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు ఉచ్ఛపట్టడంతో సహా నాలుగు గ్రహాలు మీన రాశిలో చేరడం వల్ల, లాభ స్థానానికి బలం పెరగడం వల్ల ఈ రాశివారికి ఇదివరకెన్నడూ జరగని విధంగా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ది చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపార ధన లాభాలు కలుగుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి.
  2. మిథునం: ఈ రాశివారికి ఈ నాలుగు గ్రహాల రాశి మార్పు కారణంగా దశమ స్థానానికి బాగా బలం పెరుగుతోంది. దీనివల్ల కెరీర్ కొత్త పుంతలు తొక్కుతుంది. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది.వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా అనేక లాభాలు, ప్రయోజనాలు చేకూరుతాయి. నిరుద్యోగులకు భారీ జీత భత్యాలతో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి, ఆఫర్లు కూడా అందుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో గ్రహాల బలం పెరుగుతున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. భాగ్య స్థానం విదేశాలకు సంబంధించిన రాశి అయినందువల్ల తప్పకుండా విదేశీయాన యోగం, విదేశీ సంపాదన యోగం కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది.
  4. కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో అధిక గ్రహాల సంచారం వల్ల జీవితంలో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవనశైలి సమూలంగా మారిపోతుంది. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. కుటుంబంలోకి ధన ప్రవాహం ఉంటుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభిస్తాయి.
  5. ధనుస్సు: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో శుభ గ్రహాల కలయిక వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. కుటుంబ, వైవాహిక సమస్యలు పరిష్కారమై, సామరస్యం, సానుకూలతలు పెరుగు తాయి. ఉద్యోగంలో విపరీత రాజయోగాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడంతో పాటు, ధన యోగాలు పట్టే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.
  6. మకరం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో రాజయోగ గ్రహాల యుతి వల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఏ రంగంలో ఉన్నా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. బంధు మిత్రుల నుంచే కాక, అధికారులు, సహోద్యోగుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని అభివృద్ధి ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.