Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మామూలోళ్లు కాదు.. వీళ్ల తెలివికి ఫిదా అవ్వాల్సిందే..!

సంఖ్యాశాస్త్రం ప్రకారం మన పుట్టిన తేదీ మన స్వభావాన్ని చెబుతుంది. ముఖ్యంగా 2, 5 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎమోషన్స్‌కు బదులు బుద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్లు పైకి ప్రశాంతంగా కనిపించినా.. లోతైన ఆలోచనలు, ధైర్యం, తెలివితేటలు వీరి ప్రత్యేకతలు.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మామూలోళ్లు కాదు.. వీళ్ల తెలివికి ఫిదా అవ్వాల్సిందే..!
Numerology Secrets

Updated on: Jul 25, 2025 | 3:47 PM

సంఖ్యా శాస్త్రం ప్రకారం మన పుట్టిన తేదీ చాలా ముఖ్యం. పుట్టిన తేదీలోని అంకెలన్నీ కలిపితే మన మూల సంఖ్య తెలుస్తుంది. ఉదాహరణకు మీరు 21వ తేదీన పుడితే, 2+1 = 3 అవుతుంది. కాబట్టి మీ మూల సంఖ్య 3. పుట్టిన తేదీ ఆధారంగా మనుషుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. మొత్తం 1 నుండి 9 వరకు మూల సంఖ్యలు ఉంటాయి. ప్రతి మూల సంఖ్య ఒక గ్రహానికి సంబంధించింది.. దాని వల్ల మనుషుల గుణాలు, స్వభావాలు నిర్ణయించబడుతాయి.

ఈ సంఖ్యా శాస్త్రం ప్రకారం.. కొన్ని మూల సంఖ్యలు కలిగిన అమ్మాయిలు తమ భావాల కంటే ఆలోచనలకు, స్పష్టతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్లు ఎమోషన్స్‌ ను కంట్రోల్ చేసుకుని.. వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు.

మూల సంఖ్య 2

2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవాళ్లకు మూల సంఖ్య 2 అవుతుంది. ఈ సంఖ్యకు చంద్రుడు రాజు. వీళ్లు తక్కువ మాట్లాడుతారు.. చాలా సైలెంట్‌ గా ఉంటారు. కానీ వాళ్లలోని లోతైన ఆలోచనల వల్ల ఇతరుల ఎమోషన్స్‌ ను చాలా త్వరగా అర్థం చేసుకుంటారు.

వీళ్ల స్వభావం చాలా సాఫ్ట్‌ గా ఉంటుంది. అందు వల్ల వారితో బంధాలు పెట్టుకోవడం ఈజీ. ఇతరుల అవసరాలను గమనించడంలో వీళ్లు చాలా ముందుంటారు. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోరు. డబ్బు విషయంలో చాలా తెలివిగా ఉంటారు. ఆదాయాన్ని ఎలా వాడాలో వీళ్లకు బాగా తెలుసు.

మూల సంఖ్య 5

5, 14, 23 తేదీల్లో పుట్టినవాళ్లకు మూల సంఖ్య 5. ఈ సంఖ్యకు సంబంధించిన గ్రహం బుధుడు. బుధుడు అంటే జ్ఞానం, చురుకుదనం, కమ్యూనికేషన్. వీళ్లు ప్రతిసారి నిర్ణయం తీసుకునే ముందు బుద్ధినే వాడతారు.

ఈ మూల సంఖ్య ఉన్న అమ్మాయిలు చాలా తెలివైనవాళ్లు. జీవితంలో ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలరు. వీళ్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఒకేసారి చాలా పనులను సమర్థవంతంగా చేయగలరు. వీళ్లు అనవసరమైన ఎమోషన్స్‌కు లోను కాకుండా.. పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు.

ఈ రెండు మూల సంఖ్యల (2, 5) అమ్మాయిలు ఎమోషన్స్‌కు బదులు లాజికల్ ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్లలో ఉండే కాన్ఫిడెన్స్, తెలివి, ధైర్యం వల్ల వాళ్లు నిజ జీవితాన్ని సక్సెస్‌ ఫుల్‌ గా నడిపించగలుగుతారు.