GajaKesari Yoga
ఈ నెల 25వ తేదీ నుంచి కొద్ది రోజులపాటు గ్రహ చారంలో గజకేసరి యోగం ఏర్పడబోతోంది. సుమారు వారం రోజులపాటు గురుచంద్ర గ్రహాలు పరస్పరం అనుకూలంగా సంచరించడం జరుగుతుంది. గజకేసరి యోగం అంటే గురు చంద్రులు పరస్పరం కేంద్రాలలో అంటే 1,4,7,10 స్థానాలలో సంచరించడం అన్నమాట. ప్రస్తుతం మేషరాశిలో ఉన్న గురు గ్రహానికి నాలుగో రాశిలో చంద్రుడు సంచరించడం వల్ల ఈ యోగం ఏర్పడింది. ఈ వారం రోజుల్లో ఏ కొత్త నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఏ కొత్త కార్యక్రమం చేపట్టినప్పటికీ అది తప్పకుండా విజయవంతం అవుతుంది. రాజకీయ, వ్యాపార, స్వయం ఉపాధి, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. గజకేసరి యోగం చోటు చేసుకున్న సమయంలో ఏదైనా ప్రయత్నం చేపట్టడం అంటే దానికి దైవానుగ్రహం పూర్తిగా ఉన్నట్టే భావించవచ్చు. ఇది ఏ ఏ రాశులకు ఏ విధంగా వర్తిస్తుందో ఇక్కడ పరిశీలిద్దాం.
- మేష రాశి: మేష రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు, రాజకీయ ప్రయత్నాలు, అధికార ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. స్వయం ఉపాధిలో ఉన్నవారు కూడా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గటం జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. అందువల్ల పైన పేర్కొన్న ప్రయత్నాలను ఈ వారం రోజుల కాలంలో ప్రారంభించడం చాలా మంచిది. తప్పకుండా వీలైనంత విజయం సిద్ధిస్తుంది.
- వృషభ రాశి: ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలలో తప్పకుండా విజయం లభిస్తుంది. చిన్న ప్రయత్నంతో విదేశీ సంస్థల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత ఫలితం ఉంటుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కోసం చేసే ఫలితాలు సానుకూలపడతాయి. ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టువులతో రాజీ పడటానికి అవకాశం ఉంది. స్వయం ఉపాధి రంగానికి చెందినవారు కొద్దిపాటి కృషితో స్థిరత్వం సంపాదించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది.
- మిథున రాశి: ఈ రాశి వారికి ధనం, లాభం, పురోగతి వంటి స్థానాల మీద గజకేసరి యోగ ప్రభావం పడుతున్నందువల్ల వీరి నిర్ణయాలు వీరి ప్రణాళికలు తప్ప కుండా పురోగతి చెందే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరగటానికి, వృత్తి జీవితంలో సంపాదన పెరగటానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి రేపటి నుంచి గజకేసరి యోగం కారణంగా ఆర్థికపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరగటంతో పాటు సామాజిక హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. జ్యేష్ట సోదరులకు కూడా అదృష్టం పడుతుంది.
- కర్కాటక రాశి: ఈ రాశి వారికి గజకేసరి యోగం పూర్తిస్థాయిలో వర్తిస్తుంది. ఈ యోగం ఉద్యోగ స్థానంలో పట్టడం వల్ల ఉద్యోగ పరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా అది సత్ఫలితాలను ఇస్తుంది. ఐటీ వంటి వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలు ఉద్యోగం లభించవచ్చు. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు శుభవార్త వినే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా పురోగతి, స్థిరత్వం తప్పకుండా అనుభవానికి వస్తాయి. ఆరోగ్యంలో కూడా సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది.
- సింహ రాశి: సింహ రాశి వారికి అనుకోకుండా ఆర్థిక ప్రయోజ నాలు చేతికి అంది వస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల లాభం ఉంటుంది. వడ్డీ వ్యాపారం, జూదం, షేర్లు వంటివి లాభం చేకూరుస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్త శ్రవణం ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశాలలో ఉన్న వారికి స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి తీపి కబురు వింటారు.
- కన్యా రాశి: ఈ రాశి వారికి తప్పకుండా రాజయోగం పట్టే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి ఆస్తి కలిసి రావటం సంపద పెరగటం వంటివి జరుగుతాయి. ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ పురోగతి చెందడం జరుగుతుంది. వ్యాపారంలో లాభాల శాతం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేయడం, విహారయాత్రలకు వెళ్లడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలిక అనా రోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఎంత పాజిటివ్ గా వ్యవహరిస్తే అంత మంచిది.
- తులా రాశి: ఈ రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తిపాస్తులు సంక్రమించవచ్చు. ఆస్తికి సంబంధించిన కోర్టు వివాదం సానుకూ లంగా పరిష్కారం కావచ్చు. ఆకస్మిక ధన లాభా నికి అవకాశం ఉంది. సామాజిక హోదా, పలుకు బడి పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యా లకు ప్లాన్ వేస్తారు. వ్యాపారం ప్రారంభించడానికి, స్వయం ఉపాధి చేపట్టడానికి, రాజకీయాలలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు కొత్త కార్యక్రమాలు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి.
- వృశ్చిక రాశి: ఈ రాశి వారికి భాగ్య స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల దీర్ఘకాలంగా అపరిష్కృ తంగా ఉన్న పనులు, సమస్యలు సానుకూల పడతాయి. ముఖ్యంగా ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల కారణంగా లాభ పడటం జరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. విదేశీయానానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం లభిస్తుంది. జీవితంలో ఆశించిన మార్పులు చాలావరకు చోటుచేసుకుంటాయి. ఏ విషయంలో అయినప్పటికీ కొద్ది ప్రయత్నం అవసరమని గ్రహించండి.
- ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా మార్పు చెందుతుంది. కోరుకున్న ఉద్యోగంలో కోరుకున్న విధంగా స్థిరపడటానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో సంపాదన పెరుగు తుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. జీవితాన్ని మార్చుకునేందుకు లేదా మెరుగుపరుచుకునేం దుకు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఉద్యోగ పరంగా జీవనం పరంగా ఆర్థికపరంగా వాతావరణం చాలావరకు సానుకూలంగా ఉంది. ఇది అన్ని విధాలుగాను కలిసి వచ్చే సమయం. గజకేసరి యోగం పట్టిన కాలంలో కొత్త ప్రయ త్నాలు ప్రారంభించడం మంచిది.
- మకర రాశి: మకర రాశి వారికి రేపటి(మే 25) నుంచి ఒక వారం రోజులపాటు తప్పకుండా ఉద్యోగ, ఆర్థిక పరిస్థి తుల్లో సానుకూల మార్పు చోటు చేసుకుం టుంది. అనుకోని విధంగా అదృష్టం పడుతుంది. ఇష్టమైన పనులను ఇష్టమైన విధంగా చేయటానికి అవసరమైన స్వేచ్ఛ లభిస్తుంది. గజకేసరి యోగం పూర్తిస్థాయిలో వర్తించి ఆదాయ మార్గాలు పెరగటానికి, ఉద్యోగపరంగా గుర్తింపు పొందటానికి, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్న పక్షంలో అవి పరిష్కారం కావడానికి కూడా అవకాశం ఉంది.
- కుంభ రాశి: ఈ గజకేసరి యోగం వల్ల ఈ రాశి వారికి ప్రధానంగా శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టడం జరుగు తుంది. ముఖ్యంగా రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. బంధుమిత్రుల కారణంగా ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యక్తిగత సమస్యలు ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సాధనలో పురోగతి సాధిస్తారు. ప్రయాణాల వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
- మీన రాశి: ఈ రాశి వారికి గజకేసరి యోగం కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. గతంలో ఈ రాశి వారు పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలి తాలను ఇస్తాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కొత్త ఆలోచనలు కొత్త నిర్ణ యాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి తీపి కబుర్లు అందుకుంటారు. మీ సలహాలు సూచనలకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..