Money Astrology: డబ్బుల విషయంలో ఆ రాశులవారు పిసినార్లు.. అందులో మీరు కూడా ఉన్నారా..!

| Edited By: Janardhan Veluru

Apr 14, 2023 | 2:37 PM

ఆర్థిక ప్రణాళికకు సంబంధించినంత వరకు కొన్ని రాశుల వారు అతి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. మరి కొన్ని రాశుల వారు దుబారా ఎక్కువగా చేస్తుంటారు. మరికొందరు అవసరమైన మేరకు మాత్రమే ఖర్చు చేస్తారు.

Money Astrology: డబ్బుల విషయంలో ఆ రాశులవారు పిసినార్లు..  అందులో మీరు కూడా ఉన్నారా..!
Money
Image Credit source: TV9 Telugu
Follow us on
ఆర్థిక ప్రణాళికకు సంబంధించినంత వరకు కొన్ని రాశుల వారు అతి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. మరి కొన్ని రాశుల వారు దుబారా ఎక్కువగా చేస్తుంటారు. మరికొందరు అవసరమైన మేరకు మాత్రమే ఖర్చు చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం, కన్య, మకర, మీన రాశి వారు డబ్బు విషయంలో విపరీతమైన జాగ్రత్తలు పాటిస్తారు. మేషం, సింహం, తుల, ధనస్సు రాశి వారు కొంచెం వృధా ఖర్చు చేస్తుంటారు. ఇక మిధునం, కర్కాటకం, వృశ్చికం, కుంభ రాశి వారు అవసరం అయినంతవరకే ఖర్చు చేస్తుంటారు. ఇది చంద్రుడు ఉన్న రాశులకు మాత్రమే కాకుండా లగ్నాలకు కూడా వర్తిస్తుంది. ఈ ఫలితాలు కేవలం జనరల్ ఫలితాలు మాత్రమే. జాతక చక్రంలోని గ్రహాల స్థితి గతులను బట్టి ఫలితాలలో కొద్దిగా మార్పు ఉంటుంది. డబ్బు విషయంలో ఈ రాశుల వారి అలవాట్లు, తీరుతెన్నులతో పాటు, ఈ ఏడాది వీరికి ఎలా ఉండబోతుందో కూడా పరిశీలిద్దాం.

మేషం, సింహం, తుల, ధనస్సు: 

ఈ రాశుల వారు సాధారణంగా ఆడంబరాలు, విలాసాలు, భేషజాలు వగైరాల మీద ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. ఇందులో కూడా మేష, తులారాశి వారు ఒక అడుగు ముందే ఉంటారు. ఈ రాశుల వారిలో ఎక్కువ మందికి వర్తమానమే తప్ప భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు గురించిన ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిం చడం వీరికి చేతనైన పని కాదు. డబ్బును నీళ్ళలా ఖర్చు చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. సంపాదన ప్రారంభం అయిన నాటి నుంచి వీరు తమకు కావలసిన వస్తువులను, ఇంటిని, వాహనాన్ని సమకూర్చుకుంటారు. ఈ ఏడాది ఈ నాలుగు రాశుల వారిలో మేష, తుల, ధనస్సు రాశుల వారు తమ పెరిగిన సంపాదనకు తగ్గట్టుగా ఖర్చు చేసే అవకాశం ఉంది. విలాసాలు విపరీతంగా పెరుగుతాయి. వీరితో పోలిస్తే సింహ రాశి వారు రెండు అడుగులు వెనుకబడి ఉంటారు.

వృషభం, కన్య, మకరం, మీనం: 

ఈ రాశుల వారు ఒకరకంగా పిసినారి వారి కింద లెక్క. ఒక పట్టాన డబ్బు బయటికి తీయరని చెప్పవచ్చు. డబ్బు ఇవ్వడంలోనూ, తీసుకోవడం లోనూ ఆచితూచి వ్యవహరిస్తారు. వీరికి డబ్బుకు సంబంధించినంత వరకు వృద్ధాప్యం వరకు ప్రణాళిక ఉంటుంది. సాధారణంగా విలాసాల మీద లేదా ఆడంబరాల మీద ఖర్చు చేయరు. వీరు ఆడంబరాలకు, భేషజాలకు పూర్తిగా వ్యతి రేకం. కుటుంబం మీద, బాగా సన్నిహితుల మీద మాత్రమే వీరు ఖర్చు చేస్తుంటారు. అందువల్లే వీరు వడ్డీ వ్యాపారం బ్యాంకింగ్ ఆర్థిక లావా దేవీలు షేర్లు ఇతర ఆర్థిక సంబంధమైన వ్యవహా రాలలో రాణిస్తుంటారు. పొదుపు చేయడంలో వీరికి వీరే సాటి. ఇందులో కూడా కన్య, మకర రాశి వారు రహస్యంగా కూడా డబ్బు దాచేస్తూ ఉంటారు. ఈ ఏడాది ఈ నాలుగు రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. చర, స్థిరాస్తులు సమకూర్చుకుంటారు.

మిథునం, కర్కాటకం, వృశ్చికం, కుంభం: 

ఈ నాలుగు రాశుల వారు అవసరం మేరకు మాత్రమే ఖర్చు చేస్తూ ఉంటారు. అనవసర ఖర్చులకు ఏమాత్రం అవకాశం ఉండదు. ఇంటికి అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తారు. విలాస వస్తువులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వరు. అయితే సంపాదన విషయంలో కానీ, ఖర్చు చేయడంలో కానీ పెద్దగా ప్రణాళిక ఏమీ ఉండదు. ఎక్కువగా అనవసర ఖర్చులు కూడా ఉండవు. ఖర్చు విషయంలో వీరి ప్రపంచం వేరు. ఇందులో కూడా వృశ్చిక కుంభరాశి వారు డబ్బు విషయంలో ఎక్కడా ఏ విధంగానూ ఒక పట్టాన కమిట్ కారు. డబ్బు విషయంలో వీరిని ఒప్పించడం అంత తేలికైన విషయం కాదు. ఇక ఈ ఏడాది ఈ నాలుగు రాశుల వారు తమకు అవసరమైనంతగా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునే అవకాశం ఉంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలను ఇక్కడ చదవండి..