వార ఫలాలు (జూన్ 16 నుంచి జూన్ 22, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం కలలో కూడా ఊహించని కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కుజ, శని, గురు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉన్నందువల్ల కలలో కూడా ఊహించని కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఏ మార్పు తలపెట్టినా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. పిల్లలు చదువుల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సరదాగా గడుపుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. గణపతి స్తోత్రం చదువుకోవడం వల్ల ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఈ రాశిలో గురు సంచారంతో పాటు, ధన స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల, ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబంతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి జీవితంలో తీరిక దొరకని పరిస్థితి ఏర్పడు తుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. పిల్లలు చదువుల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవ హారాలు హ్యాపీగా సాగిపోతాయి. దత్తాత్రేయ స్తోత్ర పఠనం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఈ రాశిలో శుభ గ్రహాల సంచారం వల్ల గౌరవ మర్యాదలకు లోటుండదు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలకు ఇది అనువైన కాలం. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అయిపోతారు. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సానుకూల పడతాయి. సర్వత్రా మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు అన్ని విధాలుగానే కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వ్యవ హారాల్లో ముందడుగు వేస్తారు. సుందరకాండ పారాయణం వల్ల అనేక విజయాలు లభిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
లాభ స్థానంలో గురువు, దశమ స్థానంలో కుజుడు ఉన్నంత వరకూ ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ సమస్యలుండవు. వ్యయ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల శుభ కార్యాల మీదా, పుణ్య కార్యాల మీదా ఎక్కువగా ఖర్చు చేస్తారు. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఏ విషయంలోనూ బంధుమిత్రులపై ఆధారపడకపోవడం మంచిది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసు కుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. నిరు ద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు రొటీనుగా సాగుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ఆశించిన శుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
దశమ, లాభ స్థానాల్లో శుభ గ్రహాలున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయ త్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి పనులన్నిటినీ చక్కబెడ తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు పరవాలేదని పిస్తాయి. నరసింహ స్వామి స్తోత్ర పఠనం వల్ల శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రాశ్యధిపతి బుధుడు, శుక్రుడు, గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం కూడా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అధికారులకు మీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి జీవితంలో బిజీ అవుతారు. వ్యాపారాల్లో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
శుక్ర, బుధ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన వ్యవహారాల్లో అను కూలతలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో సాఫల్యాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయి లాభాలు అందుకుంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి మంచి సమాచారం అందుతుంది. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. మిత్రుల వల్ల డబ్బు నష్టపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. హనుమాన్ చాలీసా పఠనం వల్ల శత్రు జయం ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆరవ స్థానంలో రాశ్యధిపతి కుజుడు, సప్తమంలో గురువు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు విం టారు. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు, వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంప్ర దించి కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరు గుతాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. కాలభైరవాష్టకం చదువుకోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
శని, కుజుల అనుకూల సంచారం వల్ల ఊహించని శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యల పరి ష్కారం మీద దృష్టి పెడతారు. ఏ రంగంలో ఉన్నా పురోగతి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారా లన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగిపోతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడు తుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలకు లోటుండదు. ఆదాయవృద్ధి ఉంది. ఉద్యోగాల్లో సానుకూల మార్పులకు అవకాశం ఉంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గే సూచ నలున్నాయి. స్వల్ప అనారోగ్య బాధ ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవ హారాలు రొటీనుగా సాగిపోతాయి. లలితా సహస్ర నామం చదువుకోవడం వల్ల విజయాలు లభిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
రాశ్యధిపతి శని ధన స్థానంలో, ధన కారకుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక లాభాలకు లోటుండదు. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. ఆర్థిక సంబంధమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడ తారు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు లభిస్తాయి. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న గురువు, పంచమ స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల సుఖ సంతోషాలకు, మనశ్శాంతికి లోటుండదు. ప్రతిభకు, శ్రమకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వృత్తి, ఉద్యో గాల్లో పరిస్థితులు రొటీనుగా సాగిపోతాయి. వ్యాపారాలు కూడా పరవాలేదనిపిస్తాయి. పిల్లలకు శ్రమ పెరుగుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సమస్యల మీద దృష్టి పెట్ట డం అవసరం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి. గణపతి స్తోత్ర పఠనం వల్ల ముఖ్యమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ధన స్థానంలో ధనాధిపతి కుజుడి సంచారం వల్ల, రాశ్యధిపతి గురువు తృతీయంలో స్థిర రాశిలో ఉన్నందువల్ల అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆకస్మిక ధన లాభానికి, అనేక మార్గాల్లో ఆదాయం పెరగడానికి అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. ముఖ్యమైన ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కాస్తంత ఇబ్బంది పెడతాయి. తరచూ శివార్చన చేయడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి.