Weekly Horoscope: ఆ రాశి వారికి వ్యాపారంలో ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..

| Edited By: Janardhan Veluru

May 12, 2024 | 5:01 AM

వార ఫలాలు (మే 12 నుంచి మే 18, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి. వృషభ రాశి వారికి ఈ వారమంతా మిశ్రమంగా సాగిపోతుంది. కొద్దిపాటి సమస్యలున్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. మిథున రాశి వారికి ఈ వారం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయ వంతంగా పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

Weekly Horoscope: ఆ రాశి వారికి వ్యాపారంలో ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..
Weekly Horoscope 12 May - 18 May 2024
Follow us on

వార ఫలాలు (మే 12 నుంచి మే 18, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి. వృషభ రాశి వారికి ఈ వారమంతా మిశ్రమంగా సాగిపోతుంది. కొద్దిపాటి సమస్యలున్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. మిథున రాశి వారికి ఈ వారం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయ వంతంగా పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు సాకారం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కీలక విషయాల్లో జీవిత భాగస్వామి సహాయం తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యో గాల్లో బాగా సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇష్టమైన ఆలయాలు సంద ర్శిస్తారు. చిన్నా చితకా సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఆదాయ మార్గాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. వ్యక్తిగత ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వారమంతా మిశ్రమంగా సాగిపోతుంది. కొద్దిపాటి సమస్యలున్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. బాగా సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దిగకపోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలస్యాలు ఉన్నప్పటికీ వాటిని నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మరింత పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులు శుభ వార్తలు అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు అనుకూల వాతా వరణం ఉంటుంది. బంధుమిత్రులతో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ఆలయాలు సంద ర్శిస్తారు. దైవ కార్యాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు. పిల్లల చదువుల్లో శ్రద్ధ చూపిస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వారం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయ వంతంగా పూర్తవుతాయి. ఆస్తి వ్యవహారంలో ఆశించిన విజయం సాధిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు కూడా తీరిపోయే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకపోవడం మంచిది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కొద్దిగా అష్టమ శని ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగు తాయి. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగులతో సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో అపార్థాలు తలెత్తే అవకాశముంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు తలెత్తే అవకాశముంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా లాభాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవ హరించడం మంచిది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇష్ట మైన బంధు మిత్రుల్ని కలుసుకుంటారు. జీవిత భాగస్వామికి కెరీర్ లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఈ వారమంతా కొద్దిగా మిశ్రమంగానే గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారులు మిమ్మల్ని అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. మిత్రుల మీదా, విలాసాల మీదా ఖర్చు పెరుగుతుంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయిపోతూ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆద రణకు, ప్రోత్సాహానికి లోటుండదు. సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు. ఆస్తి వ్యవహా రాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. విదే శాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వారమంతా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సానుకూలంగా పూర్త వుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉన్నత పదవులు పొందే అవకాశం కూడా ఉంది. మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. బంధువుల రాకపోకలతో ఇంటి వాతావరణం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెల కొంటాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. పిల్లల నుంచి మంచి సమాచారం అందుతుంది. ఆలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శి స్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వారమంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు ఉపశ మనం పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు జరపడం గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో అధికారులు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు కలుగు తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆదాయానికి లోటుండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఒకటి రెండు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధగా ఉండడం మంచిది కాదు. గృహ రుణాల భారం కూడా చాలావరకు తగ్గిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శారీరక, మానసిక శ్రమ పెరుగుతాయి. ముఖ్య వ్యవహారాల్లో మిత్రుల సహాయం తీసుకోవడం మంచిది. ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. ఆర్థికంగా వాతావరణం బాగా అనుకూలంగా ఉంది. ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన విధంగా మంచి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ప్రారంభించిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంటారు. తల్లితండ్రుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. ప్రయా ణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభదాయ కంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. అనుకోకుండా పెళ్లి ప్రయ త్నాలు ఫలిస్తాయి. సంతాన యోగం కలగడానికి అవకాశముంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వారమంతా సాదా సీదాగా గడిచిపోతుంది. వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, శ్రమ ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సంబంధమైన ఇబ్బందులు, చికాకులు తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. బంధువుల ద్వారా పెళ్లి ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరు స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశముంది. ప్రస్తుతానికి ప్రయాణా లను వాయిదా వేసుకోవడం మంచిది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వారమంతా ఒక మోస్తరుగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగి, అదనపు బాధ్యతల నుంచి, పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యా నికి, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. విదే‍శాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన వార్త అందుకుం టారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వారమంతా సాదా సీదాగా గడిచిపోతుంది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తొలగి, అను కూలమవుతారు. సహోద్యోగుల మీద మీ అభిప్రాయాల్లో మార్పు వస్తుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంగా పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా ఆచి తూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభదాయకంగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో కొన్ని మార్పులు చేపడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.