వార ఫలాలు (జూలై 14 నుంచి జూలై 20, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి గ్రహాల ప్రతికూలతల వల్లఈ వారం ఆశించినంత సానుకూలంగా గడిచిపోయే అవకాశం లేదు. మిథున రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురు, శుక్ర, బుధ గ్రహాలతో పాటు రాశ్యధిపతి కుజుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రతికూల పరిస్థితులు కూడా అను కూలంగా మారుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. ఉద్యోగ జీవితం రాజయోగంగా సాగిపోతుంది. కుటుంబానికి సంబంధించి అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి నుంచి గరిష్ఠంగా ఊరట లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశా జనకంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రులు సహాయపడతారు. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల శాతం పెరుగుతుంది. ఆదాయానికి లోటుం డదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇష్ట దైవానికి ప్రార్థన చేసుకోవడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
గ్రహాల ప్రతికూలతల వల్లఈ వారం ఆశించినంత సానుకూలంగా గడిచిపోయే అవకాశం లేదు. కొన్ని విషయాల్లో నిరాశా నిస్పృహలు తప్పకపోవచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల విషయాల్లో కల్పించుకోకపోవడం శ్రేయస్కరం. రాజపూజ్యాల కంటే అవమానాల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు. ఆదాయంలో ఆశించిన స్థాయిలో పెరుగుదల ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు హద్దులు దాటడం జరుగుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. ప్రయాణాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో బరువు బాధ్య తలు పెరిగి, పని భారం ఎక్కువవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొందరు బంధువులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. తరచూ శివాలయానికి వెళ్లడం వల్ల మంచి జరుగుతుంది
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
బుధ, రవి, శుక్ర, రాహువుల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సహాయం చేసే వ్యక్తులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం కొనసాగుతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాటం కంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. విలాసాలపై ఎక్కువగా ఖర్చు పెడతారు. శుభ వార్తలు వినే అవ కాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. తరచూ సుందరకాండ పారాయణం చాలా అవ సరం.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశిలో శుభ గ్రహాలు, లాభస్థానంలో గురు సంచారం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ప్రతిదీ ఆశించిన విధంగా సాగిపోతుంది. ఊహించని ఆర్థిక ప్రయోజనాల్ని అందుకుంటారు. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభి స్తుంది. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అత్య ధిక శాతం పూర్తవుతాయి. బంధువుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. వృత్తి జీవి తంలోని వారికి ఆశించిన గుర్తింపు లభించి, డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో ఆదరణ పెరుగు తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకటి రెండు రోజులు స్కంద స్తోత్ర పఠనం చాలా మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
దశమ స్థానంలో కుజ, గురువుల యుతివల్ల ఉద్యోగ జీవితంలో స్థిరత్వం లభించడంతో పాటు కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాల్లో సాధారణ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఉద్యోగం విషయంలో విదేశాల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవ హారాలు హ్యాపీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కాలభైరవాష్టకం చదువుకోవడం వల్ల శత్రు, రోగ, రుణ బాధ తగ్గు తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
దాదాపు ప్రతి గ్రహమూ అనుకూలంగా ఉన్నందువల్ల దాదాపు ప్రతి ప్రయత్నమూ నెరవేరు తుంది. ప్రతి పనీ పూర్తవుతుంది. కలలో కూడా ఊహించని విధంగా జీవితం సాగిపోతుంది. ముఖ్యంగా మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. కొత్త ప్రయత్నాలను ఆచరణలో పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. కొందరు బంధుమిత్రు లకు బాగా సహాయపడతారు. జీవిత భాగస్వామికి కూడా అనేక విధాలుగా కలిసి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ కార్యాల మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. తరచూ గణపతి స్తోత్రం చదువుకోవడం వల్ల ఆటంకాలు, అవరోధాలు తొలగిపో తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
దశమ స్థానంలో బుధ, రవి, శుక్ర గ్రహాల సంచారం వల్ల ఉద్యోగపరంగా కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కే అవకాశం ఉంది. జీతభత్యాలకు సంబంధించి కూడా శుభవార్తలు వింటారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. ఏ విధంగా చూసినా ఇది కలిసి వచ్చే సమయం. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి పెరుగుతాయి. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఇష్ట మైన ఆలయాలను సందర్శిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్య సమస్య లేవీ ఉండవు. ప్రయాణాల వల్ల లాభపడతారు. దుర్గాదేవికి ఇంట్లో పూజ చేయడం చాలా మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
సప్తమ స్థానంలో గురు, కుజ గ్రహాలతో పాటు భాగ్య స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల జీవి తం దాదాపు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఊహించని విధంగా సంపద కలిసి వస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. శత్రు, రోగ, రుణ బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. చేపట్టిన వ్యవహారాలు, పనులు సక్రమంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపా రాలు లాభాలపరంగా ఒక వెలుగు వెలుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడు తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విష్ణు సహస్ర నామ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
తృతీయ స్థానంలో శనీశ్వరుడు, ఆరవ స్థానంలో రాశ్యధిపతి గురువు బాగా అనుకూలంగా ఉండ డం శుభ యోగాలను కలిగిస్తుంది. వ్యక్తిగత జీవితం కొన్ని కీలక సమస్యల నుంచి బయటపడి పురోగతి చెందడం జరుగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధితో పాటు జీతభత్యాల్లో పెరుగుదల ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలన్నీ కలిసి వస్తాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. శత్రువులు, పోటీదార్లు బాగా తగ్గి ఉంటారు. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యల్ని అధిగమిస్తారు. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఊహించని శుభవార్తలు వింటారు. హనుమాన్ చాలీసా పఠనం వల్ల ఆత్మ విశ్వాసం పెరు గుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
శని, గురు, శుక్ర, బుధుల సంచారం బాగున్నందువల్ల మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేరడం జరుగుతుంది. శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో అద నపు బాధ్యతల భారం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రతిఫలంతో పాటు గుర్తింపు ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలకు కొరత ఉండదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. శరీరానికి వీలైనంత విశ్రాంతి ఇవ్వడం శ్రేయస్కరం. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, ఖర్చుల సమస్య కూడా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితంలో సామరస్యంగా సాగిపోతుంది. వ్యాపారం సంతృప్తికరంగా పురోగమిస్తుంది. ఆదిత్య హృదయం పఠనం వల్ల మేలు జరుగుతుంది
కుంభం (ధనిష‌్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఈ రాశివారికి గ్రహ బలం ఏమంత అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. తానొకటి తలచిన దైవమొకటి తలచును అన్నట్టుగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేప ట్టకపోవడం మంచిది. రొటీన్ వ్యవహారాలను కొనసాగించడం అవసరం. కుటుంబ జీవితం సరదాగా గడిచిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిపాటి చికాకులుండవచ్చు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. గణపతిని ధ్వానించడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న గురు, కుజుల వల్ల ఆదాయపరంగానే కాక, ఉద్యోగంలో కూడా ఆశించిన అభివృద్ధి ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం బాగా పెరుగుతుంది. కఠినంగా పొదుపు సూత్రాలను పాటిస్తారు. ఉచిత సహాయాలు, దాన ధర్మాలకు కళ్లెం వేస్తారు. ఏ ప్రయ త్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. ప్రయాణాల వల్ల, స్నేహాల వల్ల బాగా లాభం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు విస్తరి స్తాయి. ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభి స్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. దుర్గాదేవి స్తోత్రం పఠించడం చాలా మంచిది.