Weekly Horoscope: వృషభ రాశి వారికి ఉద్యోగ యోగం.. మిగిలిన రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

| Edited By: Janardhan Veluru

Feb 11, 2024 | 5:01 AM

వార ఫలాలు (ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 17, 2024 వరకు): మేష రాశి వారికి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వృషభ రాశికి చెందిన విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధించడం జరుగుతుంది. మిథున రాశికి చెందిన వారికి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Weekly Horoscope: వృషభ రాశి వారికి ఉద్యోగ యోగం.. మిగిలిన రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Weekly Horoscope 11 Feb 17 Feb 2024
Follow us on

వార ఫలాలు (ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 17, 2024 వరకు): మేష రాశి వారికి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వృషభ రాశికి చెందిన విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధించడం జరుగుతుంది. మిథున రాశికి చెందిన వారికి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలోనూ, వృత్తి జీవితంలోనూ ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాల శాతం పెరుగుతుంది. కొత్త ప్రయ త్నాలు, కొత్త నిర్ణయాలు కలసి వస్తాయి. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా ఆదరాభిమానాలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు. వ్యయ స్థానంలో ఉన్న రాహువు కారణంగా అనుకోని ఖర్చులు, డబ్బు నష్టాలకు అవకాశం ఉంది. తరచూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఒకటి రెండు సమస్యలుండే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి, వ్యయ ప్రయాసలు తప్పక పోవచ్చు. అయితే, ఎక్కడా గౌరవ మర్యాదలకు లోటుండదు. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో వృద్ధి కనిపి స్తుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం, ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువులతో మాటలు పడాల్సి వస్తుంది. సంతానంలో ఒకరికి చదువులు లేదా ఉద్యోగ పరంగా యోగం పట్టే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధించడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వ్యయ స్థానంలో గురువు కారణంగా ఖర్చుల మీద అదుపు తప్పుతుంది. శివార్చన చేయించడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, వ్యక్తిగత పనులు కూడా స్నేహితుల సహకారంతో పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రభుత్వపరంగా లబ్ధి పొందడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఎవరికీ ఎటువంటి హామీలూ ఉండవద్దు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. లలితా సహస్ర నామ పారాయణం వల్ల ఆటంకాలు తొలగు తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

భాగ్య, దశమ స్థానాలు బలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా వారమంతా వైభవంగా సాగిపోతుంది. కెరీర్ పరంగా సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. గృహ వాతావరణం కొద్దిగా సమస్యాత్మకంగా ఉండవచ్చు. వాదోపవాదాలకు అవకాశం ఇవ్వకపోవడం మంచిది. జీవిత భాగ స్వామికి అన్నివిధాలుగానూ మంచి పురోగతి ఉంటుంది. చదువులు లేదా ఉద్యోగాల విషయంలో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండ డం మంచిది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో మధ్య మధ్య చికా కులు తలెత్తే అవకాశం ఉంది. సుందరకాండ పారాయణ వల్ల ప్రశాంత జీవనం సాధ్యమవుతుంది.

సింహం (మఖ, పుబ్బ. ఉత్తర 1)

శుభ గ్రహాల దృష్టి వల్ల వారమంతా సానుకూలంగానే గడిచిపోతుంది. ఈ రాశిని భాగ్య స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల అనేక సమస్యలు క్రమంగా తొలగిపోయే అవకాశం ఉంది. ఒక అరుదైన అదృష్ట యోగాన్ని కూడా సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. నిరుద్యోగులు ఆశిం చిన సంస్థల నుంచి ఆఫర్లు అందుకుంటారు. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కాస్తంత సామరస్యంతో వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగు తుంది. ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడతారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వారమంతా కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాల్సి ఉంటుంది. కొందరు మిత్రులను నమ్మి ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు పరవాలేదనిపి స్తాయి. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి. దుర్గాదేవి స్తోత్రం చదువుకోవడం వల్ల ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవు తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. నాలుగవ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్ప డడం వల్ల అన్ని రంగాల్లోనూ పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. వ్యాపారాలు పెట్టుబడులకు అంచనాలకు మించిన ప్రతిఫలం అందుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు కనిపిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగు లకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు పెరుగుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. విష్ణుసహస్ర నామం చదువుకోవడం వల్ల ధనపరంగా మరింత అభివృద్ధి సాధిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వారమంతా సాధారణంగా సాగిపోతుంది. సమస్యలు, వివాదాలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకెక్కే అవకాశం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితికి, ఆరోగ్యా నికి ఢోకా ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు బాగా ఇబ్బంది పెడతాయి. బాధ్యతలకు సంబంధించిన ఒత్తిడి ఉంటుంది. కీలక నిర్ణయాలలో జీవిత భాగ స్వామిని సంప్రదించడం మంచిది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరి పోతాయి. మిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. శివార్చన చేయించడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

సమయం బాగా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో మార్పులు చేసి లబ్ది పొందుతారు. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగాల్లో ఉన్నవారు వ్యాపార రంగంలో ప్రవేశించే సూచనలున్నాయి. ఆదాయా నికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. బంధు మిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు అందుకుంటారు. వ్యక్తిగత సమస్య ఒకటి సానుకూలంగా పరిష్కారం అవు తుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నరసింహ స్వామిని ధ్యానించడం చాలా మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

శుభ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల వారమంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. మనసులో ఏ కోరిక కోరుకున్నా సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులకు అండగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కాస్తంత విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవి తం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. శివుడిని ధ్యానించడం వల్ల మానసిక ప్రశాంతత లభి స్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

గ్రహబలం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేనందువల్ల వారమంతా కష్ట సుఖాల మిశ్రమంగా సాగి పోతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కానీ, కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు ఇబ్బంది కరంగా మారతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగి, అదనపు బాధ్యతలు మీద పడి విశ్రాంతి కరువవుతుంది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి ఇబ్బం దులు తలెత్తుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుటుంబ సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. దాంప త్యంలో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థుల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహా రాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం వల్ల సానుకూలతలు పెరుగు తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

సమయం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది. అనేక విషయాల్లో అనుకూలతలు కనిపి స్తాయి. దాదాపు అన్ని రంగాల వారికి బాగుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి చెందడానికి అవ కాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, వ్యూహాలు పని చేస్తాయి. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలుంటాయి. జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. దైవ కార్యాలు, సేవా కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఒకరిద్దరు బంధువులకు సహాయం చేస్తారు. విద్యార్థులు విజయాలు సాధి స్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధగా ప్రార్థించడం మంచిది.