
వార ఫలాలు (అక్టోబర్ 1నుంచి అక్టోబర్ 7, 2023 వరకు): మేష రాశి వారికి ఒకట్రెండు శుభయోగాలు పట్టబోతున్నాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. మిథున రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి అక్టోబర్ 1 తేదీ నుంచి అక్టోబర్ 7 తేదీ వరకు వారఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురు, శని, శుక్ర, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి ఒకటి రెండు శుభయోగాలు పట్టబోతున్నాయి. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుందని చెప్పవచ్చు. ఆదాయంలో ఆశించిన పెరుగుదల కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. మంచి లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందివచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది కానీ, తొందరపాటు నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. సతీమణికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి అయిన శుక్రుడు, బుధుడు, రవి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాలు ఈ వారం బాగా ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగు పడుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి నుంచి కూడా కొంత వరకూ విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు ఫలించి లబ్ధి పొందుతారు. సమయం అనుకూలంగా ఉన్నందువల్ల వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త కార్యక్రమాలను, కొత్త ప్రయత్నాలను చేపట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు సునాయాసంగా మంచి ఫలితాలు సాధిస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
గురు, బుధ, శని గ్రహాల అనుకూలత వల్ల వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులకు కళ్లెం వేస్తారు. మిత్రులను సైతం అతిగా నమ్మకపోవడం మంచిది. మోసపోవడమో, నష్టపోవడమో జరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి ఖాయమయ్యే సూచనలున్నాయి. పిల్లల నుంచి ఆశిం చిన సమాచారం అందుతుంది. ఉద్యోగం మారే ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. తల్లితండ్రుల సహకారంతో ఆస్తి వివాదం పరిష్కరిం చుకుంటారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
శుక్ర, కుజ, రవుల అనుకూలత ఉన్నందువల్ల మంచి ఉద్యోగంలోకి మారడానికి, అధికారం చేపట్ట డానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు కాలం బాగా అనుకూలంగా ఉంది. కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపా రాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కొత్త నిర్ణయాలతో ముందుకు వెడతారు. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి. సతీమణితో షాపింగ్ చేస్తారు. పిల్లల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఈ రాశినాథుడు రవి ధన స్థానంలో ఉండడం వల్ల, అక్కడ బుధుడితో కలవడం వల్ల ఆదాయ మార్గాలు పెరగడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వంటివి జరుగుతాయి. కుటుంబ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భాగ్య స్థానం నుంచి గురుడి వీక్షణ వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా తప్పకుండా అదృష్టం పడుతుంది. ఉద్యోగంలో ఆశించిన దాని కంటే ఎక్కువ పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. విద్యార్థుల ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఈ రాశి నాథుడు ఉచ్ఛ పట్టడం, రవితో కలిసి ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో బాగా రాణించడం, గుర్తింపు పొందడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆరవ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. శత్రు సమస్యలు, పోటీదార్ల ఒత్తిళ్లు బాగా తగ్గిపోతాయి. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. వ్యాపారాల్లో లాభాలు నిల కడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారా లపై దృష్టి సారిస్తారు. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు కాలం అను కూలంగా ఉంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఈ రాశికి రాశినాథుడు అనుకూలంగా ఉండడం, సప్తమ స్థానం నుంచి గురువు వీక్షించడం వగైరాల వల్ల ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలమవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభ దాయకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఆశించిన స్థాయిలో రాణిస్తారు. సతీమణికి వృత్తి, ఉద్యోగాలపరంగా పదోన్నతి లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధు వర్గంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగి పోతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో రవి, బుధ, రాశ్యధిపతి కుజుడు ఉండడం వల్ల ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబంలో చిన్నపాటి చికాకులు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అసంతృప్తికి దారితీస్తాయి. ఎవరికీ హామీలు ఉండ వద్దు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవు తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చు తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సహాయం అందజేయడం జరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. విద్యార్థులు సునా యాసంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ధన స్థానంలో ధనాధిపతి శనీశ్వరుడు, భాగ్య స్థానంలో భాగ్యాధిపతి బుధుడు బలంగా ఉన్నందువల్ల ఆదాయం పరిస్థితి మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూ లంగా సాగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి గానీ, సంపద గానీ కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులకు, సహచరులకు సహాయంగా ఉంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, సకాలంలో బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తించగలుగుతారు. ఆధ్యాత్మిక వ్యవహారా లపై దృష్టి సారిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. విద్యార్థులు శ్రద్ధాసక్తులు పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
శుభ గ్రహాలైన శుక్ర, బుధులు మాత్రమే అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు ఉంటాయి. మిగిలిన అన్ని వ్యవహారాలు సాధారణంగా ముందుకు సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో బాధ్యతలు, ఒత్తిళ్లు పెరుగుతాయి. నిరుద్యోగులు, అవివాహితలు కొద్ది కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
గురు, బుధ, కుజ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనేక ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపా రాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. మంచి స్నేహాలతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. కొత్త నిర్ణయాలకు, కొత్త కార్యక్రమాలకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు స్నేహితుల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. విద్యార్థు లకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.