
Weak Mercury In Astrology
జ్యోతిషశాస్త్రంలో బుధుడిని తెలివితేటలు, వాక్చాతుర్యం, వ్యాపారానికి కారకంగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలోనైనా బుధ గ్రహం బలహీనంగా ఉంటే.. వారు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా బుధువు జాతకంలో బలహీనంగా ఉంటే.. అతను ఇతరులతో మాట్లాడటంలో, వ్యాపారంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో జాతకంలో బుధుడు స్థానం చెడుగా ఉంటే ఏమి జరుగుతుందో, ఈ గ్రహాన్ని సరిచేయడానికి పరిష్కారాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..
జాతకంలో బుధుడు స్థానం చెడుగా ఉంటే ఏమవుతుంది?
జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకంలో బుధుడు చెడుగా ఉంటే.. ఒక వ్యక్తి వ్యాపారంలో నష్టం, విద్యలో ఆటంకం, చర్మ వ్యాధి, మాట్లాడే సమస్యలు వంటి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాదు బుధుడు చెడుగా ఉన్నప్పుడు మానసికంగా ఇబ్బంది పడతారు. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా బలహీనపడుతుంది.
- బుధుడు చెడుగా ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు కలుగుతాయి
- జీర్ణశక్తి బలహీనపడవచ్చు దీనివల్ల కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.
- అలెర్జీలు , ముడతలు, ఇతర చర్మ వ్యాధులు వంటి చర్మ సమస్యలు సంభవించవచ్చు.
- జుట్టు రాలడం, గోర్లు బలహీనం కావడం కూడా సంభవించవచ్చు.
- కొన్ని సందర్భాల్లో బయటపడని వ్యాధులు కూడా బయట పడవచ్చు.
- బుధుడు చెడుగా ఉన్నప్పుడు కమ్యూనికేషన్ నైపుణ్యాలతో సమస్యలు కలగవచ్చు.
- బుధుడు చెడుగా ఉన్నప్పుడు మాట్లాడటంలో ఇబ్బంది ఉంటుంది. ఉదాహరణకు తడబడటం లేదా నత్తిగా మాట్లాడటం.
- బుధుడు చెడుగా ఉంటే జ్ఞాపకశక్తి బలహీనపడవచ్చు.
- తప్పుడు నిర్ణయాలు తీసుకునే ధోరణి ఉండవచ్చు.
- సంభాషణలో అపార్దాలు కలుగవచ్చు.
- బుధ గ్రహం చెడుగా ఉండటం వల్ల వ్యాపారం, వృత్తిలో నష్టం కలుగవచ్చు.
- వ్యాపారంలో నష్టం జరగవచ్చు.
- ఉద్యోగంలో విజయం సాధించడంలో ఇబ్బందులు ఉండవచ్చు.
- హోదా, ప్రతిష్ట తగ్గే అవకాశం ఉంది.
- అంతేకాదు స్టూడెంట్స్ కు చదువులంటే ఆసక్తి కలుగదు.
బుధ గ్రహం చెడు స్థానంలో ఉంటే ఏ వ్యాధి కలుగుతుందంటే..
జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం చెవులు, ముక్కు , గొంతుకు సంబంధించిన వ్యాధులకు నేరుగా సంబంధించినది. బుధుడు బలహీనంగా ఉంటే చర్మ సమస్యలు, అంటు వ్యాధులు, మెదడు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది .
బుధ స్థానం బలపడేందుకు చేయాల్సిన పరిష్కారాలు ఏమిటి?
- బుధవారం ఉపవాసం: బుధవారం ఉపవాసం ఉండటం వల్ల బుధ గ్రహం స్థానం బలపడుతుంది .
- గణేశుని పూజ: గణేశుని పూజించడం వల్ల బుధ గ్రహం బలపడుతుంది.
- తులసి మొక్క: ఇంట్లో తులసి మొక్కను నాటి దానికి నీరు పోయడం శుభప్రదంగా భావిస్తారు.
- ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయాలి: బుధవారం నాడు పెసలు , ఆకుపచ్చ బట్టలు, ఆకుపచ్చ కూరగాయలు మొదలైనవి దానం చేయడం శుభప్రదం.
- బుధ మంత్రం పఠించడం: “ఓం బ్రం బ్రిం బ్రౌం సః బుధాయ నమః ” లేదా “ఓం బం బుధాయ నమః ” అనే మంత్రాన్ని పఠించడం ద్వారా బుధుడు బలపడతాడు .
- పచ్చ రత్నం: జ్యోతిష్కుడిని సంప్రదించిన తర్వాత పచ్చ రత్నాన్ని ధరించడం కూడా బుధ గ్రహాన్ని బలోపేతం చేయడానికి ఒక మార్గం.
- ఆవుకు పచ్చి గడ్డిని ఆహారంగా అందించండి: బుధవారం రోజున ఆవుకు పచ్చి గడ్డిని ఆహారంగా అందించడం వలన బుధ గ్రహం స్థానం బలపడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.