Bedroom Vastu Tips: పొరపాటున కూడా ఈ స్థలంలో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచవద్దు.. భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతాయి..

|

Dec 06, 2022 | 7:48 AM

ఇంట్లో ప్రతిదీ ఉంచడానికి ఒక ఖచ్చితమైన దిశ ఉంది. వాస్తు ప్రకారం, ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్‌ను దిశ ప్రకారం ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది.

Bedroom Vastu Tips: పొరపాటున కూడా ఈ స్థలంలో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచవద్దు.. భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతాయి..
Dressing Table Direction in Bedroom
Follow us on

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతిదీ ఒక వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. వాస్తులో ప్రతిదీ ఉంచడానికి ఒక నిర్దిష్ట దిశ, నియమాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రంలో ఫర్నిచర్ ఉంచడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ దిక్కు కూడా అందులో ప్రత్యేక స్థానం ఉంది. ఇంటి డ్రెస్సింగ్ టేబుల్ మీ అదృష్టాన్ని మార్చగలదు అంటు నమ్మలేక పోవచ్చు.. కానీ ఇది నిజం. ఎందుకంటే మనం అందంగా రెడీ అయ్యేది దీని ముందే.. దానిని తప్పు దిశలో ఉంచడం మీ ఇంటి వాస్తును పాడు చేస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్‌ని ఏ దిశలో ఉంచాలి. ఏ దిశలో ఉంచకూడదు అనే విషయాలను మనం తెలుసుకుందాం..

డ్రెస్సింగ్ టేబుల్‌కి సంబంధించిన వాస్తు చిట్కాలు

మీ మంచంలో ఏదైనా భాగంలో అద్దం ఉంటే, వెంటనే దాన్ని తొలగించండి. అటువంటి అద్దం జీవితకాలం తగ్గిపోతుంది. మంచం ముందు అద్దం ఉండకుండా ప్రయత్నించండి. మంచం ముందు అద్దం ఉంటే అది భార్యాభర్తలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీంతో భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. బెడ్‌రూమ్‌లోని కిటికీ లేదా తలుపు ముందు డ్రెస్సింగ్ టేబుల్‌ను ఎప్పుడూ ఉంచవద్దు. ఎందుకంటే బయటి నుంచి వచ్చే కాంతి గదిలో డ్రెస్సింగ్ టేబుల్ అద్దంపై ప్రతికూలతను ప్రతిబింబిస్తుంది.

పడకగదిలో తలుపు లోపల అద్దం పెట్టకూడదు. తలుపు ఈశాన్య దిశలో ఉన్నట్లయితే ఇది ఒక సందర్భంలో మాత్రమే పనికి వస్తుంది. మంచం మీద పడుకున్న వ్యక్తి ప్రతిబింబం అద్దంలోకి రాకూడదు. నిద్రపోతున్నప్పుడు కొన్ని కారణాల వల్ల అద్దంలో ప్రతిబింబం కనిపిస్తే అది బయటి వ్యక్తులకు వీరు స్పష్టంగా కనిపిస్తుంటారు. ఇది ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సమయంలో అద్దానికి లైట్ కర్టెన్ ఏర్పాటు చేసుకోండి.

డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ, ఎలా ఉంచాలి

వాస్తు ప్రకారం, గాజు నుంచి ఎల్లప్పుడూ ఒక రకమైన శక్తి ఉద్భవిస్తుంది. ఈ శక్తి ఎంత మంచి లేదా చెడు అనేది అది కేంద్రీకృతమై ఉన్న ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. గదిలో డ్రెస్సింగ్ టేబుల్‌ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. దాని అద్దం చాలా పెద్దదిగా ఉండకూడదని ప్రయత్నించాలి. బెడ్‌రూమ్‌లో రౌండ్‌ షేప్‌ తప్ప ఏదైనా ఆకారపు అద్దం పెట్టుకోవచ్చు. ఏదైనా పదునైన, విరిగిన అద్దం ఉంటే.. వెంటనే దానిని పడకగది నుంచి తొలగించండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని వాస్తు టిప్స్ కోసం