Today Horoscope: ఈ రాశివారికి చేపట్టే పనులలో ఆటంకాలు.. ఆకస్మిక ప్రయాణాలు.. ఆర్థిక ఇబ్బందులు..!

|

Aug 07, 2021 | 6:12 AM

Today Rasi Phalalu: మనం పలు సందర్భాల్లో ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే చాలా మంది రోజును..

Today Horoscope: ఈ రాశివారికి చేపట్టే పనులలో ఆటంకాలు.. ఆకస్మిక ప్రయాణాలు.. ఆర్థిక ఇబ్బందులు..!
Follow us on

Today Rasi Phalalu: మనం పలు సందర్భాల్లో ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే చాలా మంది రోజును ప్రారంభించే ముందు తమ తమ రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటుంటారు. భారత దేశంలో రాశిఫలాలను విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచీతూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే శనివారం పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష:

ఈ రాశివారు మీమీ రంగాల్లో ముందు చూపుతో వెళ్లడం మంచిది. ముఖ్యమైన విషయాలలో ఆచితూచీ అడుగులు వేయాలి. బంధుమిత్రుల సలహాలు అవసరం. ఒత్తిడి పెరుగకుండా డా చూసుకోవాలి.

వృషం:

కుటుంబ సభ్యులతో కలిసి పనులు చేస్తే ఫలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మిథునం

ఈ రాశివారు చేపట్టే పనులు సిద్ధిస్తాయి. ఆర్థికంగా ఫలితాలు దక్కే అవకాశాలున్నాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉండటంతో జాగ్రత్తలు పాటించడం మంచిది.

కర్కాకటం:

చేపట్టే పనులలో అనుకూలత లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు మంచి వార్తలు వింటారు.

సింహం:

చేపట్టే పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. భవిష్యత్తు ప్రణాళిక వేస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉండటం మంచిది. తోటివారితో విబేధాలు వచ్చే అవకాశాలున్నాయి.

కన్య:

ఈ రాశివారు విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు.

తుల:

వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కీలక వ్యవహారాలలో మంచి ఫలితాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు తప్పవు.

వృశ్చికం:

అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యమైన విషయాలలో ముందుచూపుతో వెళ్లడం మంచిది. వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి.

ధనుస్సు:

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండటం ఎంతో మంచిది. లేకపోతే అనవసరమైన మాటలు పడే అవకాశం ఉంది.

మకరం:

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహాయసహకారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

కుంభం:

వృత్తి, ఉద్యోగల్లో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతత లేకుండా కొంత ఇబ్బందిపడే అవకాశం ఉంది.

మీనం:

అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. చేపట్టిన పనులలో కొంత ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఇతర వివాదాల జోలికి వెళ్లకపోవడం మంచిది.