Lucky Horoscope
మకర రాశిలో మూడు గ్రహాలు కలవడం, ఇందులో కుజుడికి ఉచ్ఛపట్టడం, ఇక్కడే బుధాదిత్య యోగం ఏర్పడడం వంటి కారణాల వల్ల నాలుగు ద్విస్వభావ రాశులతో పాటు, సింహ, కుంభ రాశుల జీవితాల్లో ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ద్విస్వభావ రాశులంటే మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరగవు కానీ, అనుకోకుండా మాత్రం కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తప్పకుండా అప్రయత్న ధన లాభం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కూడా ఊహించని విధంగా పదోన్నతులు పొందడం జరుగుతుంది.
- మిథునం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో కుజ, బుధ (రాశ్యధిపతి), రవులు కలవడం వల్ల అప్రయత్న ధన లాభానికి, ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రయత్నం చేయకపోయినా కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో తనకు రాదనుకుని ఆశలు వదిలేసుకున్న ప్రమోషన్ అనుకోకుండా తనను వరించే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలు, లాటరీలు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. ఆశలు వదిలేసుకున్న బాకీలు, బకాయిలు వసూలయ్యే సూచనలు కూడా ఉన్నాయి.
- సింహం: ఈ రాశికి ఆరవ స్థానంలో రవి (రాశ్యధిపతి), కుజ, బుధులు కలవడం వల్ల నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందివచ్చే అవకాశం ఉంది. ఏమాత్రం ప్రయత్నం చేయని సంస్థల నుంచి కూడా ఉద్యోగులకు కొత్త అవకాశాలు అందడం జరుగుతుంది. ఆర్థికంగా అనుకోని లాభాలు చేకూరుతాయి. జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు చేతికి అందడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్యంలో అనూహ్యమార్పు చోటు చేసుకుంటుంది.
- కన్య: ఈ రాశికి పంచమ స్థానంలో రవి, బుధ (రాశ్యధిపతి), కుజుడు చేరినందువల్ల అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పిల్లలు ఆశించిన దానికంటే ఎక్కువగా వృద్ధిలోకి వస్తారు. మీ ప్రతిభా పాటవాలకు, పనితీరుకు అనూహ్యంగా అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడానికి అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా పెరుగుతాయి. కొన్ని ఆశ్చర్యకర శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఎప్పుడో చేసిన ఆర్థిక ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితాలు అందడం ప్రారంభం అవుతుంది. ఎటువంటి ప్రయత్నమూ చేయకుండానే ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. మంచి పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి.
- కుంభం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో మూడు గ్రహాల కలయిక వల్ల ఒకటి రెండు శుభవార్తలు అందు తాయి. విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. అనుకోకుండా విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న తీర్థయాత్రలు, విహార యాత్రలకు ఇప్పుడు సమయం కలిసి వస్తుంది. ఎదురు చూస్తున్న పెళ్లి సంబంధాలు ఖాయం కావడం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడం, పిల్లలు జీవితంలో స్థిరపడడం, ఆదాయం పెరగడం వంటివి జరుగుతాయి.
- మీనం: ఈ రాశికి లాభ స్థానంలో మూడు గ్రహాలు చేరడం వల్ల అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదరడమో, ప్రేమలో పడడమో జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.