Telugu Astrology: ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!

జాతకంలో వ్యయ స్థానమైన 12వ ఇంట్లో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల ఖర్చులు, వైఫల్యాలు, అనారోగ్యాలు, మానసిక ఒత్తిడి, వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మేషం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, మీన రాశుల వారు ఈ ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అయితే తగిన జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే ఈ ప్రతికూల ప్రభావాలను చాలావరకు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Telugu Astrology: ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!
Telugu Astrology

Edited By:

Updated on: Jun 24, 2026 | 5:48 PM

సాధారణంగా 12వ స్థానంలో ఉన్న గ్రహాల కారణంగానే వైఫల్యాలు, నిరాశా నిస్పృహలు, అనారోగ్యాలు, ఆశాభంగాలు, సమస్యలు, వివాదాలు, విభేదాలు ఎక్కువగా కలుగుతుంటాయి. పన్నెండవ స్థానం, అంటే వ్యయ స్థానం వల్లే జీవితం అస్తవ్యస్తమవుతుంటుంది. ప్రస్తుతానికి కొద్ది కాలం పాటు మేషం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, మీన రాశుల వారు ఈ వ్యయ స్థానంలోని గ్రహం వల్ల బాగా ఇబ్బందులు పడడం జరుగుతుంది. వ్యయ స్థానంలో ఉన్న గ్రహానికి పరిహారాలు చేయడం వల్ల ఇటువంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

  1. మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో శని సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో కనీవినీ ఎరుగని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగం రాకపోవడం, ఉద్యోగం పోవడం, పురోగతి లేకపోవడం, ఒత్తిడి, వేధింపులు పెరగడం, నిందలు పడడం ఎక్కువగా జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రహస్య శత్రువులు, పోటీదార్లు పెరిగే అవకాశం ఉంటుంది. చక్కని అవకాశాలు చేజారిపోవడం జరుగుతుంది. తరచూ శనికి తైలాభిషేకం చేయడం వల్ల వీటి నుంచి తప్పకుండా విముక్తి లభిస్తుంది.
  2. మిథునం: ఈ రాశికి వ్యయ స్థానంలో ఆగస్లు 2 వరకు కుజ సంచారం వల్ల ఈ రాశివారికి దాంపత్య జీవితంలో కలతలు మొదలవుతాయి. అనారోగ్యాలు పీడిస్తాయి. శస్త్రచికిత్సల అవసరం కలుగుతుంది. బాగా సన్నిహితులైన బంధుమిత్రులు కొందరు దూరమవుతారు. దూర ప్రాంతంలో చిన్న ఉద్యోగంతో సర్దుకుపోవలసి వస్తుంది. తరచూ స్కంద స్తోత్రం పఠించడంతో పాటు కుమారస్వామికి అర్చన చేయించడం, కుజుడికి ప్రదక్షిణలు చేయడం వల్ల వీటి నుంచి బయటపడడం జరుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి వ్యయ స్థానంలో బుధ సంచారం వల్ల ఉద్యోగంలో పొరపాట్లు జరగడం, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవడం, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో వైఫల్యం చెందడం, ఆదాయం వృద్ధి చెందకపోవడం, శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉండడం, ఆర్థికంగా మోసపోవడం వంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు పెరగడం, పురోగతి ఆగిపోవడం వంటివి కూడా జరుగుతాయి. గణపతికి అర్చన చేయించడం వల్ల ఈ రాశివారికి మేలు కలుగుతుంది.
  4. సింహం: ఈ రాశికి వ్యయ స్థానంలో గురు సంచారం వల్ల ఈ రాశివారు ఎంత ప్రయత్నించినా కుటుంబంలో పెళ్లి, శంకుస్థాపన, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరగవు. వృథా ఖర్చులు, అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడతారు. చేతిలో డబ్బు నిలవదు. రావలసిన సొమ్ము రాకపోవచ్చు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. ఆశాభంగాలు, నిరాశా నిస్పృహలు ఎక్కువగా కలుగుతాయి. వీరు క్రమం తప్పకుండా అక్టోబర్ 31 వరకు విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించడం మంచిది.
  5. ఇవి కూడా చదవండి
  6. కన్య: ఈ రాశికి వ్యయ స్థానంలో కేతు సంచారం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో, ఎప్పుడు ఎలాంటి సమస్యలు మీద పడతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. రోగ నిర్దారణ చేయలేని అనారోగ్యాలు, ఊహించని ఖర్చులు, లేనిపోని సమస్యలు పీడిస్తాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంటుంది. సోదరుల నుంచి ఆస్తి సమస్యలు ఎదురవుతాయి. కేతు వుకు ప్రదక్షిణలు చేయడంతో పాటు స్కంద స్తోత్రాన్ని పఠించడంవల్ల ఈ సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉంది.
  7. మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా డిసెంబర్ 5 వరకు పురోగతి స్తంభించిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా తగ్గే అవకాశం ఉంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. రాజపూజ్యాల కంటే అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువుల్ని కోల్పోయే అవకాశం ఉంది. రహస్య శత్రువుల వల్ల ఇబ్బంది పడతారు. తరచూ స్కంద స్తోత్రం పఠించడంతో పాటు రాహువుకు పరిహారం చేయించడం మంచిది.
Loading...
Unable to load recommendations.
Follow Us