Horoscope Today: ఆ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (May 23, 2025): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృషభ రాశి వారి హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. మిథున రాశి వారి వ్యాపారాలు ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 23 May 2025

Edited By:

Updated on: May 23, 2025 | 5:01 AM

దిన ఫలాలు (మే 23, 2025): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారి వ్యాపారాలు ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. కొందరు బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. తలపెట్టిన వ్యవహారాలు, పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి అపార్థాలు తలెత్తుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక వ్యవహారాలకు, లావాదేవీలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. పెళ్లి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లే‌ష)

అదనపు ఆదాయ అవకాశాలు విస్తరిస్తాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం ఇబ్బందులు పాలు చేస్తాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. వృత్తి, ఉద్యోగాల్లో ఇతరుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతల భారం బాగా పెరుగుతుంది. పని ఒత్తిడి వల్ల విశ్రాంతి కరువవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కొందరు మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మకపోవడం మంచిది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సంతృప్తి కరంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెంచడం మంచిది. కుటుంబంలో ప్రశాంత, సామరస్య వాతావరణం నెలకొంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కుటుంబంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆస్తి, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు ఎక్కువగా వింటారు. ప్రముఖుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. గృహ, వాహనాల ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా బయటపడతారు. ఇష్టమైన బంధుమిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి రాబడికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపడతారు. రాబడికి లోటుండకపోవచ్చు. ఉద్యోగ జీవి తం సానుకూలంగా సాగిపోతుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పెండింగ్ పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభ వార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెడతారు. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కొందరు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. పనిభారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అపార్థాలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆస్తి వివాదానికి సంబంధించి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు అసంతృప్తి కలిగిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చుల్ని తగ్గించుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి, సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి.