శత్రు పీడ నుంచి ఈ రాశులకు విముక్తి..! వారిపై కుట్రలు పనిచేయవంతే..

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక, వ్యక్తిగత జీవితంలో పోటీదారులు, శత్రువుల బెడద చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదృష్టం చేసుకుంటే తప్ప వీరి మీద పైచేయి సాధించడం కష్టమే. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతక చక్రంలో ఆరవ స్థానాన్ని బట్టి, ఆరవ స్థానాధిపతిని బట్టి శత్రుజయం ఎవరికి సాధ్యమో చెప్పబడింది. దీని ప్రకారం వృషభం, మిథునం, కన్య సహా మరికొన్ని రాశుల వారు మరో రెండు నెలల పాటు ఈ విరోధుల మీద పైచేయి సాధించడం జరుగుతుంది.

శత్రు పీడ నుంచి ఈ రాశులకు విముక్తి..! వారిపై  కుట్రలు పనిచేయవంతే..
Win Over Enemies

Edited By: Janardhan Veluru

Updated on: Jul 15, 2025 | 6:31 PM

శత్రువులు, విరోధులు, ప్రత్యర్థులు, పోటీదార్లు, అసూయాపరులు, రహస్య శత్రువుల సమస్యల నుంచి బయటపడడమనేది మామూలు విషయం కాదు. వీరు అనేక రూపాల్లో, అనేక విధాలుగా పీడించడం జరుగుతుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక, వ్యక్తిగత జీవితంలో కూడా వీరి బెడద దుర్భరంగా ఉంటుంది. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప వీరి మీద పైచేయి సాధించడం సాధ్యపడదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతక చక్రంలో ఆరవ స్థానాన్ని బట్టి, ఆరవ స్థానాధిపతిని బట్టి ఈ విరోధుల గురించి చెప్పడం జరుగుతుంది. వృషభం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశుల వారు మరో రెండు నెలల పాటు ఈ విరోధుల మీద పైచేయి సాధించడం జరుగుతుంది.

  1. వృషభం: ఈ రాశికి రాశినాథుడైన శుక్రుడే ఆరవ స్థానాధిపతి కావడం, ప్రస్తుతం ఈ శుక్రుడు వృషభ రాశిలోనే ఉండడం వల్ల ఈ రాశివారు ఉద్యోగంలో శత్రువుల మీద, వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద చాలావరకు పైచేయి సాధిస్తారు. ఈ రాశివారికి సొంతవారే విరోధులుగా మారే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇక ఈ రాశివారికి అసూయాపరుల నుంచి, రహస్య శత్రువుల ఇబ్బందులుండే అవకాశం ఉంది. వీరు కూడా ప్రస్తుతం బాగా తగ్గి ఉంటారు.
  2. మిథునం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి కుజుడు ప్రస్తుతం తృతీయ స్థానంలో కేతువుతో కలిసి ఉన్నందువల్ల సహచరులు, రక్త సంబంధీకుల వల్ల కష్టనష్టాలు కలుగుతాయి. అయితే, విరోధులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద ఈ రాశివారు తప్పకుండా విజయాలు సాధిస్తారు. ఈ రాశివారిని చూసి విరోధులు భయపడి, తగ్గి ఉండే అవకాశం ఉంది. కొందరు కుట్రలు, కుతంత్రాల ద్వారా దెబ్బ తీయడానికి అవకాశం ఉన్నా, అవేవీ ఫలించే అవకాశం ఉండదు. పోటీదార్ల బెడద తగ్గుతుంది.
  3. కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు సప్తమ స్థానంలో ఉండడం, రాహువు ఆరవ స్థానంలో ఉండడంవల్ల విరోధుల వల్ల సమస్యలు, ఆటంకాలు, అడ్డంకులు ఉండకపోవచ్చు. పైగా శత్రువులు మిత్రులుగా మారే అవకాశం కూడా ఉంది. వీరిని చూసి అసూయపడేవారు, కుట్రలు చేసేవారు ఎక్కువగా ఉంటారు. పరిచయాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొందరు మిత్రుల వల్ల ధన నష్టం జరుగుతుంటుంది. వీరికి శత్రు జయం కలుగుతుంది.
  4. తుల: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన గురువు భాగ్య స్థానంలో ఉండడం, ఆరవ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల మరో ఏడాదిపాటు శత్రువులు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో వీరికి పోటీదార్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఉద్యోగంలో కూడా సహచరుల నుంచి సమస్యలుంటాయి. అయితే, గురువు భాగ్య స్థానంలో ఉన్నంత వరకూ వీరికి శత్రు జయం ఉంటుంది. మిత్రుల ముసుగులో వీరికి విరోధులు చుట్టుపక్కలే బాగా సన్నిహితంగా ఉంటారు.
  5. వృశ్చికం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన కుజుడు దశమ కేంద్రంలో ఉన్నందువల్ల ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారాల్లోనూ శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుజుడే ఆరవ స్థానాధిపతి కూడా అయినందువల్ల బంధువులు, రక్త సంబంధీకుల నుంచి కూడా ప్రతిబంధకాలు ఎదురవుతుంటాయి. కుజుడు ప్రస్తుతం ఈ రాశిలో బలంగా ఉన్నందువల్ల శత్రువులపై పైచేయి సాధించడం జరుగుతుంది. శత్రువులే భయపడే అవకాశం కూడా ఉంది. కొందరు శత్రువులే మిత్రులుగా మారతారు.
  6. మకరం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన బుధుడు ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉండడం, ఆరవ స్థానంలో గురువు సంచారం చేస్తుండడం వల్ల తప్పకుండా శత్రుజయం కలుగుతుంది. జీవిత భాగస్వామి, దగ్గర బంధువులు, వ్యాపార భాగస్వాముల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నా చివరికి ఈ రాశివారికే విజయం లభిస్తుంది. ఏ రంగంలో ఉన్నా వీరి పనితీరు అసూయ కలిగిస్తూ ఉంటుంది. గురు, బుధుల బలం వల్ల వీరి మీద కుట్రలు, కుతంత్రాలు పని చేయకపోవచ్చు.