Telugu Astrology: ఈ ఏడాది లక్ష్యసాధకులు ఈ రాశుల వారే.. అనుకున్నది సాధిస్తారు..!

Zodiac Signs: 2025 సంవత్సరంలో కొన్ని రాశుల వారు తమ లక్ష్యాలను సులభంగా సాధించే అవకాశం ఉంది. గురు, శని, రాహువుల అనుకూలత వీరికి ఎక్కువగా ఉండటం వల్ల వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితిలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వీరు నిర్ణయాత్మకత, పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించుకుంటారు. ఇందులో మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి.

Telugu Astrology: ఈ ఏడాది లక్ష్యసాధకులు ఈ రాశుల వారే.. అనుకున్నది సాధిస్తారు..!
Telugu Astrology

Edited By: Janardhan Veluru

Updated on: Jul 08, 2025 | 1:32 PM

Lucky Zodia Signs: జ్యోతిషశాస్త్రం ప్రకారం మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారు కార్య శూరులు. ఈ రాశులవారిలో పట్టుదల, మొండితనం, తెగువ, చొరవ వంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నాన్నయినా అర్ధంతరంగా వదిలిపెట్టే అవకాశం ఉండదు. ఆదాయం, ఉద్యోగం, వ్యాపారం, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో సాధారణంగా ఈ రాశులవారే ముందుంటారు. ఈ ఏడాది గురు, శని, రాహువుల అనుకూలతలు వీరికి ఎక్కువగా ఉన్నందువల్ల వీరు తమకు తాము లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించుకునే అవకాశం ఉంటుంది.

  1. మేషం: ఈ రాశివారిలో ఉద్యోగంలో గానీ, వృత్తి, వ్యాపారాల్లో గానీ అందలాలు ఎక్కాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. రాజపూజ్యాల కోసం, ఆదాయవృద్ది కోసం, ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడం కోసం ఆరాటపడతారు. రాహువు, గురువుల అనుకూలత ఎక్కువగా ఉన్నందువల్ల వీరు ఏడాది గడిచే లోగా తప్పకుండా తమ లక్ష్యాలను సాధించుకుంటారు. శని వ్యయ స్థానంలో ఉన్నందువల్ల విదేశాల్లో ఉద్యోగాల కోసం వీరు ప్రయత్నించడం మంచిది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు.
  2. మిథునం: వ్యూహాలను రచించడంలో, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంలో ఈ రాశివారు సాటి లేని మేటిగా ఉంటారు. వీరికి దూరదృష్టి కూడా ఎక్కువ. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మదుపులు, పొదుపులు చేయడంలో, పెట్టుబడులు పెట్టడంలో సిద్ధహస్తులు. ఈ ఏడాదంతా ఈ రాశిలో గురువు సంచారం చేయడం, భాగ్య స్థానంలో రాహువు ఉండడం వల్ల ఆదాయ వృద్ధిని వీరు లక్ష్యంగా చేసుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో విశేష లాభాలు ఆర్జించడం జరుగుతుంది.
  3. సింహం: ఈ రాశివారికి అధికారం మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా అగ్రస్థానం మీదే వీరి దృష్టి కేంద్రీకృతమవుతుంది. ఈ రాశివారికి సప్తమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఏదో విధంగా ఉన్నత పదవులను చేపట్టడానికి వీరు ప్రయత్నాలు సాగిస్తారు. లాభ స్థానంలో ఉన్న గురువు వీరి ఆశయాలను, ఆకాంక్షలను తప్పకుండా తీరుస్తాడు. అష్టమ శని కారణంగా కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ వీరు ఏడాది చివరి లోగా తప్పకుండా తమ లక్ష్యాలను చేరుకుంటారు.
  4. తుల: ఈ రాశికి ఉన్నత స్థాయి జీవనశైలి మీదా, విలాస జీవితం మీదా దృష్టి ఎక్కువగా కేంద్రీకృతమవుతుంది. అందరినీ కలుపుకునిపోవడం, దూరదృష్టితో వ్యవహరించడం, వ్యూహ రచన చేయడంలో అందె వేసిన చెయ్యిగా పేరున్న ఈ రాశివారు అనేక విధాలుగా ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో తమ నైపుణ్యాలను పెంచుకుని అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో సరికొత్త మార్పులు చేపట్టి లాభాలు గడిస్తారు. జీవనశైలిని పూర్తిగా మార్చుకుంటారు.
  5. ధనుస్సు: ఉన్నతాశయాలు, అలవికాని లక్ష్యాలు, తీవ్రస్థాయి ప్రయత్నాలు, విపరీతమైన తెగువ, చొరవ కలి గిన ఈ రాశివారు సవాళ్లను, సమస్యలను ముఖాముఖీ ఎదుర్కొంటారు. ఉద్యోగంలో ఉన్నత పదవులు అధిరోహించడం, వృత్తి, వ్యాపారాల్లో అత్యధిక లాభాలు గడించడం, ఉన్నత స్థాయి జీవితం గడపడం వంటి లక్ష్యాలను సాధించడంలో వీరెక్కడా రాజీపడరు. తృతీయస్థానంలో రాహువు, సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువు ఉన్నందువల్ల వీరు తప్పకుండా కార్యశూరులవుతారు.
  6. మకరం: ఈ రాశివారు పట్టుదలకు, మొండితనానికి పెట్టింది పేరు. ఎటువంటి సవాలునైనా, సమస్యనైనా మౌనంగా ఎదుర్కునే తత్వం కలిగిన ఈ రాశివారు ఒక సంస్థలో ఉన్నతాధికారి కావడానికి బాగా కృషి చేసే అవకాశం ఉంది. ఈ లక్ష్య సాధన కోసం ఎంతటి శ్రమకైనా వెనుకాడరు. సరికొత్త నైపుణ్యాలను, ప్రజ్ఞలను అలవరచుకుని, సీనియర్లను మించి పోయే అవకాశం ఉంది. ఒక పక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటూనే మరొక పక్క అందలాల కోసం ప్రయత్నించి సఫలీకృతులవుతారు.