Sunset Worship Rules: సూర్యాస్తమయం సమయంలో ఈ పనులు చేస్తే, ఇంట్లో డబ్బులు, ఆహారం కొరతను ఎదుర్కోవాల్సిందే..

|

Jun 27, 2023 | 6:56 AM

సూర్యాస్తమ సమయంలో రోజువారీ జీవితానికి సంబంధించిన నియమాలు కూడా ఇవ్వబడ్డాయి. జీవితంలో అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంట్లో సుఖశాంతులు, శాంతి సౌభాగ్యాలు నెలకొనాలంటే సూర్యాస్తమయ సమయంలో ఆ తర్వాత పొరపాటున కూడా ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు ఈ రోజు తెలుసుకుందాం.. 

Sunset Worship Rules: సూర్యాస్తమయం సమయంలో ఈ పనులు చేస్తే, ఇంట్లో డబ్బులు, ఆహారం కొరతను ఎదుర్కోవాల్సిందే..
Sunset Worship Rules
Follow us on

సనాతన హిందు ధర్మంలో అదృష్టం పొందడానికి.. దురదృష్టాన్ని నివారించడానికి ఏ పనినైనా సమయానుసారంగా చేయాలని సలహా ఇస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం సూర్యోదయం సమయంలో చేసే  పూజలకు నియమనిబంధలు ఉన్నాయి. అదే విధంగా సూర్యాస్తమ సమయంలో రోజువారీ జీవితానికి సంబంధించిన నియమాలు కూడా ఇవ్వబడ్డాయి. జీవితంలో అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంట్లో సుఖశాంతులు, శాంతి సౌభాగ్యాలు నెలకొనాలంటే సూర్యాస్తమయ సమయంలో ఆ తర్వాత పొరపాటున కూడా ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు ఈ రోజు తెలుసుకుందాం..

సూర్యాస్తమయం సమయంలో చేయకూడని పనులు ఏమిటంటే? 

  1. హిందూ విశ్వాసం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం, ఆరబెట్టడం శుభప్రదం కాదు. హిందూ విశ్వాసం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఆరు బయట ఆరబెట్టడం వలన ప్రతికూల శక్తి వాటిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా వ్యక్తి దుఃఖం, దురదృష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
  2. హిందూ విశ్వాసాల ప్రకారం సూర్యాస్తమయం సమయంలో ఎవరూ ఎప్పుడూ నిద్రపోకూడదు. వ్యాధుల బారిన పడిన వారు, చిన్న పిల్లలు మినహా మిగిలిన వ్యక్తులు సూర్యాస్తమ సమయంలో నిద్రపోవడం దారిద్య్రానికి కారణం. అటువంటి వ్యక్తులున్న ఇంట్లో వ్యాధి, దుఃఖం,పేదరికం ఇంట్లోనే ఉంటాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. హిందూ విశ్వాసం ప్రకారం సూర్యాస్తమయం సమయంలో మీ ఇంటికి తిరిగి వస్తుంటే.. ఆ సమయంలో తప్పనిసరిగా ఏదైనా మీతో ఇంట్లోకి తీసుకుని రావాలి. సూర్యాస్తమయం సమయంలో లేదా అనంతరం  ఇంట్లోకి ఖాళీ చేతులతో రావడం అతి పెద్ద దోషంగా పరిగణించబడుతుంది.
  5. ఇంట్లో సంపదకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే.. సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా ఎవరైనా గోర్లు, జుట్టును కత్తిరించుకోకూడదు. ఈ నియమాన్ని పక్కకు పెట్టి గోర్లు, జుట్టు కత్తిరిస్తే డబ్బు కొరత, అప్పుల సమస్యను ఎదుర్కోవలసి ఉంటుందని విశ్వాసం.
  6. హిందువుల విశ్వాసం ప్రకారం చెట్లు, మొక్కల్లో దేవతలు కొలువై ఉంటారు. కనుక చెట్లు దేవతలుగా పూజించదగినవిగా భావిస్తారు. సూర్యాస్తమయం తర్వాత చెట్ల ఆకులు, కొమ్మలు మొదలైన వాటిని విరగొట్టడం, చెట్లను కాల్చడం, చెట్ల పువ్వులను కోయడం అతి పెద్ద తప్పుగా పరిగణిస్తారు.
  7. హిందువుల విశ్వాసం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత చనిపోయిన వ్యక్తికి దహన క్రియలు చేయరు.. అంత్యక్రియల గురించి గరుడ పురాణంలో కొన్ని నియమాలు పేర్కొన్నారు. ఈ నియమాన్ని విస్మరిస్తే, చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి లభించదు. ఆత్మ చేరుకున్న తదుపరి లోకంలో బాధపడవలసి ఉంటుంది.
  8. హిందూ విశ్వాసం ప్రకారం సూర్యాస్తమయం సమయంలో ఇంటికి చీపురుతో శుభ్రపరచ కూడదు. ఇలా చేయడం వలన సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి ఆగ్రహానికి ఆ కుటుంబ సభ్యులు గురవుతారని.. ఇంట్లోని ధనం, ఆహారపదార్థాలకు కొరత ఏర్పడుతుందని విశ్వాసం.

సూర్యాస్తమయం సమయంలో చేయాల్సిన పనులు ఏమిటంటే..

హిందూ విశ్వాసం ప్రకారం సూర్యాస్తమయం సమయంలో రోజువారీ పూజలు, సాధారణ జీవితానికి సంబంధించిన కొన్ని చర్యలు పేర్కొన్నారు. ఈ చర్యలను పాటించడం వలన వ్యక్తి ఆనందం, అదృష్టాన్ని పొందుతాడు. సనాతన సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి సాయంత్రం తన ఇంటి ప్రవేశద్వారం వద్ద, ఇంటి మూలల్లో దీపాలను ఏర్పాటు చేయాలి. సనాతన సంప్రదాయం ప్రకారం, సూర్యాస్తమయం సమయంలో తులసి మొక్క దగ్గర స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మాత్రమే కాదు, నారాయణుడి అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంకా టీవీ9 తెలుగు దీన్ని దృవీకరించడంలేదు.