Sunday Astro Tips: ఆదివారం పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. లేదంటే ఆర్ధిక కష్టాలు మాత్రమే కాదు రోగాల బారిన కూడా పడతారు..

|

Aug 27, 2023 | 7:04 AM

సూర్యుని అనుగ్రహం ఉంటే వృత్తి, వ్యాపారంలో చాలా విజయాలు పొందుతాడు. అంతేకాదు రాజకీయాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. మంచి నాయకత్వ సామర్థ్యం లభిస్తుంది. అందుకే సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం కొన్ని చర్యలు చేపట్టాలి. అదే సమయంలో సూర్యుని కోపాన్ని కలిగించే కొన్ని  పనులకు దూరంగా ఉండాలి. ఆదివారం చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం.. 

Sunday Astro Tips: ఆదివారం పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. లేదంటే ఆర్ధిక కష్టాలు మాత్రమే కాదు రోగాల బారిన కూడా పడతారు..
Sunday Puja Tips
Follow us on

హిందూ సనాతన ధర్మంలో ఆదివారం సూర్యునికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్య భగవానుడిని  ప్రత్యేకంగా పూజిస్తారు. సూర్య భగవానునికి అర్ఘ్యన్ని సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల జాతకంలో సూర్యుడు స్థానం బలపడుతుంది. విజయం, విశ్వాసం, కీర్తి, ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రహం సూర్యుడు. సూర్యుని అనుగ్రహం ఉంటే వృత్తి, వ్యాపారంలో చాలా విజయాలు పొందుతాడు. అంతేకాదు రాజకీయాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. మంచి నాయకత్వ సామర్థ్యం లభిస్తుంది. అందుకే సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం కొన్ని చర్యలు చేపట్టాలి. అదే సమయంలో సూర్యుని కోపాన్ని కలిగించే కొన్ని  పనులకు దూరంగా ఉండాలి. ఆదివారం చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం..

ఆదివారం చేయకూడని పనులు

ఆదివారం ఎప్పుడూ నీలం, నలుపు, బూడిద రంగుల దుస్తులను ధరించవద్దు. ఈ రంగులు శనిశ్వరుడి  సంబంధించినవి. తండ్రి తనయులైన సూర్యుడు, శనీశ్వరుడు శత్రు గ్రహాలు. అందుకే ఆదివారం రోజున నలుపు-నీలం రంగు దుస్తులు ధరించడం వల్ల సూర్యుడికి కోపం వస్తుంది. అలాగే జీవితంలో ప్రతికూలత పెరుగుతుంది. ఈ రోజు నారింజ, ఎరుపు, పసుపు రంగుల దుస్తులను ధరించడం శుభప్రదం. దీంతో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

ఆదివారం రాగి అమ్మవద్దు. అలాగే రాగితో చేసిన ఏ వస్తువునూ అమ్మకూడదు. రాగి సూర్యునికి సంబంధించినది. ఆదివారం రాగిని అమ్మడం వల్ల సూర్యుడు బలహీనపడతాడు.

ఇవి కూడా చదవండి

ఆదివారం నాన్ వెజ్ ఆహరం అంటే మాసం, మద్యం వంటి వాటికీ దూరంగా ఉండండి. ఇలా చేయడం వల్ల సూర్యుడు బలహీన పడతాడు. సూర్యుడితో పాటు.. శనీశ్వరుడు కూడా చెడు ఫలితాలను ఇస్తాడు.

ఆదివారం పడమర వైపు ప్రయాణించకూడదు. మీరు ఈ రోజున ప్రయాణం చేయవలసి వస్తే.. నెయ్యి లేదా పాన్ తిన్న తర్వాత ప్రయాణం చేయండి. అలాగే ముందుగా తూర్పు వైపు 5 అడుగులు నడవండి.. తిరిగి వెనక్కి వెళ్లి ఆ తర్వాత పడమర వైపు వెళ్లండి.

మీరు ఇల్లు నిర్మించుకున్నట్లు అయితే ఆదివారాల్లో గృహ నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయవద్దు. దీంతో పనుల్లో జాప్యం, ఆటంకాలు ఎదురవుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)