Career Astrology 2024: మేష రాశిలోకి రవి ప్రవేశం.. ఆ రాశుల వారికి అధికార యోగం..!

| Edited By: Janardhan Veluru

Apr 09, 2024 | 3:34 PM

ఈ నెల 14న రవి మేష రాశి ప్రవేశం చేస్తోంది. మేష రాశి రవి గ్రహానికి ఉచ్ఛ క్షేత్రం. గ్రహ రాజైన రవి ఉచ్ఛపట్టడం వల్ల కొన్ని రాశులకు తప్పకుండా అధికారపరంగా, ఆదాయపరంగా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభ రాశివారికి తప్పకుండా ఆదాయ వృద్ధితో కూడిన అధికార యోగం పడుతుందని చెప్పవచ్చు.

Career Astrology 2024: మేష రాశిలోకి రవి ప్రవేశం.. ఆ రాశుల వారికి అధికార యోగం..!
Job Astrology
Follow us on

ఈ నెల 14న రవి మేష రాశి ప్రవేశం చేస్తోంది. మేష రాశి రవి గ్రహానికి ఉచ్ఛ క్షేత్రం. గ్రహ రాజైన రవి ఉచ్ఛపట్టడం వల్ల కొన్ని రాశులకు తప్పకుండా అధికారపరంగా, ఆదాయపరంగా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభ రాశివారికి తప్పకుండా ఆదాయ వృద్ధితో కూడిన అధికార యోగం పడుతుందని చెప్పవచ్చు. మే నెల 15 వ తేదీ వరకూ ఈ రాశులకు వృత్తి, ఉద్యోగాలు కామధేనువుల్లా మారతాయి.

  1. మేషం: రవికి మేష రాశి ఉచ్ఛ క్షేత్రం. ఈ రాశిలో ప్రవేశించబోతున్న రవి తప్పకుండా ఈ రాశివారిని అంద లాలు ఎక్కిస్తాడు. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం కలిగించడంతో పాటు, సామాజికంగా, కుటుంబపరంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం పెంచుతాడు. రాజకీయ నాయకులకు, ప్రభుత్వంలో ఉన్నవారికి మరింతగా అధికార యోగం, ధన వృద్ధి యోగం పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. దర్జాగా బతకడం జరుగుతుంది. జీవన శైలి చాలావరకు మారిపోతుంది.
  2. మిథునం: ఈ రాశివారికి లాభ స్థానంలో రవి సంచారం వల్ల జాతకంలో ఎటువంటి దోషాలున్నా కొట్టుకు పోతాయి. లాభ స్థానంలో ఉన్న రవి వల్ల ఆదాయం పెరగడం, అధికార యోగం పట్టడం, అనారోగ్యాల నుంచి కోలుకోవడం వంటివి తప్పకుంగా జరుగుతాయి. సంతానం లేనివారికి సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో వృద్ధిలోకి వస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా బాగా అవకాశముంది.
  3. కర్కాటకం: ఈ రాశికి దశమంలో రవి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతికి అవకాశముంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు జరుగుతాయి. మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశముంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగంలో స్థిరపడతారు. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా విదేశాల్లో ఉద్యో గం లభించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండు పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు.
  4. సింహం: ఈ రాశినాథుడైన రవి భాగ్య స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగు తాయి. ఏ రంగంలో ఉన్నవారికైనా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారికి, ప్రభుత్వంలో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల పరంగా ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయ వృద్ధి ఉంటుంది. విదేశాల నుంచి అవకాశాలు అందుతాయి. ప్రభుత్వపరంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం పటిష్ఠంగా మారుతుంది.
  5. వృశ్చికం: ఈ రాశికి ఆరవ స్థానంలో రవి గ్రహం ఉచ్ఛపట్టడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు, శత్రువుల బెడద తగ్గడం కానీ, వారి మీద విజయం సాధించడం గానీ జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఆశించిన విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగం పడుతుంది. వృత్తి జీవితంలో డిమాండు, దాంతో పాటు రాబడి వృద్ధి చెందుతాయి.
  6. కుంభం: ఈ రాశికి మూడవ స్థానంలో రవి సంచారం ప్రారంభమైనందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో దూసుకు పోవడం జరుగుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగులు సైతం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగు తుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.