Sun Transit: వృశ్చిక రాశిలో రవి.. ఆ రాశుల వారికి రాజ యోగాలు పక్కా..!

ఈ నెల (నవంబర్) 17 నుంచి డిసెంబర్ 16 వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ రాశిలో రవి దాదాపు ఉచ్ఛ బలంతో సంచరిస్తాడు. అందువల్ల కొన్ని రాశుల వారికి రవి రాజ యోగాలనిచ్చే అవకాశం ఉంది.

Sun Transit: వృశ్చిక రాశిలో రవి.. ఆ రాశుల వారికి రాజ యోగాలు పక్కా..!
Raja Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 10, 2024 | 5:54 PM

ఈ నెల 17 నుంచి డిసెంబర్ 16 వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ రాశిలో రవి దాదాపు ఉచ్ఛ బలంతో సంచరిస్తాడు. అందువల్ల కొన్ని రాశుల వారికి రవి రాజ యోగాలనిచ్చే అవకాశం ఉంది. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారి జీవితాల్లో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్తగా అనేక ఆదాయ, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి.

  1. వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన రవి సప్తమ కేంద్ర సంచారం వల్ల ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపా రాల్లో విభేదాలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగు లకు హోదాలు పెరుగుతాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశికి ధనాధిపతి అయిన రవి పంచమ స్థానంలో సంచారం వల్ల ధనపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందు తుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వమూలక ధన లాభ సూచనలున్నాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. మాటకు బాగా విలువ పెరుగుతుంది.
  3. సింహం: రాశ్యధిపతి రవి చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహ, వాహన ప్రయత్నాలు తప్ప కుండా సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  4. వృశ్చికం: దశమాధిపతిగా ఈ రాశిలో రవి సంచారం వల్ల ఉద్యోగపరంగా కీలకమైన శుభ పరిణామాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి. ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఉద్యోగంలో స్థిరత్వానికి, పదోన్నతికి అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగి, నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది.
  5. మకరం: ఈ రాశికి లాభ స్థానంలో రవి సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి, అధికారుల ఆదరణ మరింత పెరగడానికి అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అనారోగ్య సమస్యల నుంచి దాదాపు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వపరంగా ఊహించని లాభాలు కలుగు తాయి. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు, ఆటంకాలు తొలగిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి.
  6. కుంభం: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు సైతం మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగంలో సహచరుడితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సుఖాంతమయ్యే సూచనలున్నాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే