Sun Transit: స్వస్థానమైన సింహ రాశిలోకి రవి..ఆ రాశుల వారికి దశ తిరిగినట్టే..!

| Edited By: Janardhan Veluru

Aug 07, 2024 | 7:25 PM

ఈ నెల 16న గ్రహ రాజు రవి తన స్వస్థానమైన సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. రవి ఇక్కడ సెప్టెంబర్ 17 వరకూ కొనసాగుతాడు. అత్యంత శక్తిమంతుడైన రవి గ్రహం తన ఉచ్ఛ రాశి అయిన మేషంలో ప్రవేశించినా, తన స్వస్థానమైన సింహ రాశిలో సంచారం ప్రారంభించినా మిగిలిన అన్ని గ్రహాల మీద ఆధిపత్యం చెలాయించడం జరుగుతుంది. సింహ రాశిలో రవి సంచరిస్తున్నప్పుడు కొన్ని రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది.

Sun Transit: స్వస్థానమైన సింహ రాశిలోకి రవి..ఆ రాశుల వారికి దశ తిరిగినట్టే..!
Sun Transit 2024
Follow us on

ఈ నెల 16న గ్రహ రాజు రవి తన స్వస్థానమైన సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. రవి ఇక్కడ సెప్టెంబర్ 17 వరకూ కొనసాగుతాడు. అత్యంత శక్తిమంతుడైన రవి గ్రహం తన ఉచ్ఛ రాశి అయిన మేషంలో ప్రవేశించినా, తన స్వస్థానమైన సింహ రాశిలో సంచారం ప్రారంభించినా మిగిలిన అన్ని గ్రహాల మీద ఆధిపత్యం చెలాయించడం జరుగుతుంది. సింహ రాశిలో రవి సంచరిస్తున్నప్పుడు కొన్ని రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. అధికారపరంగానే కాకుండా, ఆదాయ పరంగా కూడా తప్పకుండా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఎటువంటి క్లిష్ట సమస్యలనైనా అధిగమిస్తారు. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చిక రాశుల వారికి ఈ యోగాలు పట్టే అవకాశం ఉంది. రవి సింహరాశిలో ఉన్నంత కాలం రోజూ ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఏ రంగంలోనైనా శీఘ్ర పురోగతి ఉంటుంది.

  1. మేషం: ఈ రాశివారికి అత్యంత శుభుడైన రవి పంచమ కోణంలో సంచారం వల్ల ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. కొత్త నైపుణ్యాలను అలవరచుకునే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో అధికారులకు బాగా ఉపయోగపడతారు. ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. ఎటువంటి పదవినైనా నిర్వర్తించగల సామర్థ్యం ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
  2. వృషభం: ఈ రాశికి చతుర్థాధిపతి అయిన రవి చతుర్థ స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల కొద్ది ప్రయ త్నంతో గృహ, వాహనాలు కలుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించు తాయి. శత్రువులు, పోటీదార్ల సమస్యలు చాలావరకు మటుమాయం అవుతాయి. ప్రభుత్వ మూలక ధన లాభం ఉంటుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు.
  3. కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి రవి సంచారం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. మాటకు విలువ ఏర్పడుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. విహార యాత్రలు, తీర్థ యాత్రలు ఎక్కువగా చేస్తారు. ప్రముఖులతో లాభ దాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. సంతాన యోగం కలుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగంలో జీతాలు బాగా పెరుగుతాయి.
  4. సింహం: రాశ్యధిపతి రవి ఇదే రాశిలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూ లంగా పరిష్కారం అయి, సంపద బాగా కలిసి వస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
  5. తుల: ఈ రాశివారికి లాభ స్థానంలో లాభాధిపతి రవి సంచారం వల్ల ప్రభుత్వ మూలక ధన లాభం ఉంటుంది. ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనా రోగ్యాల నుంచి కోలుకుంటారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహ సంబంధం కుదు రుతుంది. ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది.
  6. వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారులకు మీ పనితీరు బాగా నచ్చుతుంది. హోదా పెరగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.