Sun Transit In Makara Rashi
Adhikara Yoga: గ్రహాలకు రాజైన రవి రాశి మారినప్పుడల్లా కొన్ని రాశులకు మేలు చేయడం జరుగుతుంది. అధికారం, తండ్రి, ప్రభుత్వం, పాలన, గుర్తింపు, ప్రాచుర్యం, ఆరోగ్యం వంటి అంశాలకు కారకుడైన రవి సాధారణంగా ఏదో ఒక యోగం కలిగించకుండా రాశి మారడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ నెల 16వ తేదీన రవి మకర రాశిలో ప్రవేశించి, ఫిబ్రవరి 16 వరకూ అదే రాశిలో కొనసాగుతాడు. రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పర్వదినం ఏర్పడుతుంది. రవి మకర రాశిలో సంచారం చేస్తున్నంత కాలం మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి జీవితం వైభవంగా సాగిపోతుంది.
- మేషం: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం పట్టింది. దీనివల్ల ఉద్యోగంలో అధికార యోగం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో తండ్రి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
- వృషభం: ఈ రాశికి చతుర్ధాధిపతిగా అత్యంత శుభుడైన రవి భాగ్య స్థానంలో సంచారం వల్ల తండ్రితో సానుకూలతలు ఏర్పడతాయి. అనేక విధాలుగా తండ్రి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడం గానీ, ధన లాభం కలగడం గానీ జరుగుతుంది. కొద్ది ప్రయ త్నంతో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభిస్తుంది.
- కర్కాటకం: ఈ రాశికి ధనాధిపతిగా రవి సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. రావ లసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. నిరుద్యోగు లకు దూర ప్రాంతంలో తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఎదురు చూస్తున్న శుభ వార్తలు అందుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి.
- తుల: ఈ రాశికి చతుర్థ స్థానంలో లాభాధిపతి రవి సంచారం వల్ల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. ఆస్తి వివా దాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. తండ్రి వైపు నుంచి సంపద లభిస్తుంది. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన రవి ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం పెరగడానికి ఏ ప్రయ త్నం చేపట్టినా ఆశించిన ఫలితాలనిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు బాగా వృద్ధి చెందు తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న వ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుంది.
- మీనం: ఈ రాశికి లాభ స్థానంలో రవి సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం, రాహుకేతువుల దోషం వంటివన్నీ బాగా బలహీనపడతాయి. లాభస్థానంలో రవి సంచరిస్తున్నప్పుడు జాతకంలో కోటీ దోషాలున్నా తొలగిపోతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పితృవర్గం నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. ఆస్తి వివాదాలు బాగా అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ప్రభుత్వ మూలక ధన లాభం కలుగుతుంది.