Maha Samyoga: వందేళ్ల తరువాత మహా సంయోగం.. ఈ రాశులకు ఉద్యోగ, ఆకస్మిక ధనప్రాప్తి..

|

Mar 21, 2023 | 9:53 AM

మీనరాశిలో బుధగురుసూర్యచంద్ర గ్రహాల కలయిక ఏర్పడనుంది.  గ్రహాలకు గురవైన గురు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. అటు బుధ, సూర్య గ్రహాలు కూడా

Maha Samyoga: వందేళ్ల తరువాత మహా సంయోగం.. ఈ రాశులకు ఉద్యోగ, ఆకస్మిక ధనప్రాప్తి..
Astrology; Sun Mercury Jupiter Moon Transit 2023
Follow us on

జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిశ్చిత రాశిలో సంచరిస్తుంటుంది. ఫలితంగా ఇది అన్ని రాశులపైనా ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే ఇది కొన్నిరాశులకు శుభప్రదంగానూ, మరికొన్ని రాశులకు ఇబ్బందులను కలిగించేదిగా ఉంటుంది. అయితే ఈ నెల 22న మీనరాశిలో బుధగురుసూర్యచంద్ర గ్రహాల కలయిక ఏర్పడనుంది.  గ్రహాలకు గురవైన గురు(బృహస్పతి) ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. అటు బుధ, సూర్య గ్రహాలు కూడా ఇదే రాశిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే మార్చ్ 22వ తేదీన చంద్రుడు కూడా మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఒకే రాశిలో ఒకే సమయంలో బుధ, గురు, సూర్య, చంద్ర గ్రహాలు ఉండబోతున్న కారణంగా వందేళ్ల తర్వాత తొలి సారిగా మహా సంయోగం కలగనుంది. అంతేకాక 4 శుభ యోగాలు కూడా ఏర్పడతాయి. గజకేసరి యోగం, నీచభంగ యోగం, బుధాదిత్య యోగం, హంసయోగం.. ఇలా నాలుగు శుభయోగాలు ఏర్పడిన కారణంగా రాశిచక్రంలోని నాలుగు రాశుల మీద దీని ప్రభావం అత్యంత శుభప్రదంగా ఉండనుంది. ఇక ఈ రాశులవారికి సకలసౌభాగ్యాలు, సుఖసంతోషాలు సొంతమవుతాయి. మరి ఆ 4 రాశులేమిటో మనం ఇప్పుడు చూద్దాం..

కన్యా రాశి: వందేళ్ల తరువాత ఏర్పడనున్న ఈ మహా సంయోగం కారణంగా కన్యా రాశివారి జీవితంలోకి అష్టైశ్యర్యాలు వచ్చినట్టేనని అర్ధం చేసుకోవచ్చు. వీరికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అన్ని వైపుల నుంచి కూడా విజయం ప్రాప్తిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు పెరగడంతో పాటు.. ఏదైనా పెద్ద డీల్ చేయడం ద్వారా భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో విజయం.. వైవాహిక జీవితం, ప్రేమ జీవితం రెండూ బాగుంటాయి.

వృషభ రాశి: బుధ, సూర్య, గురు, చంద్ర గ్రహాల కలయికతో ఏర్పడనున్న మహా సంయోగం వందేళ్లలో ఇదే మొదటిసారి. ఫలితంగా వృషభ రాశివారి జీవితంలో అత్యంత శుభ ఫలాలు అందనున్నాయి. వీరు తమ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. సమాజంలో లేదా నలుగురిలో మీ పట్ల ఆకర్షణ పెరుగుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడడంతో పాటు పాత పెట్టుబడులు కూడా లాభాల్ని అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

కుంభ రాశి: 4 రాజయోగాలతో వందేళ్ల తరువాత ఏర్పడనున్న మహా సంయోగం.. కుంభరాశివారి జీవితంలోకి ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది. శని కారణంగా జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి విముక్తి పొందడానికి అదృష్టం తోడవుతుంది. పనుల్లో విజయం,  కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

మిథున రాశి: మిథున రాశి జీవితంలో రాజయోగం కారణంగా పనుల్లో విజయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి, కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి, బదిలీ, జీతంలో పెరుగుదల ఉంటుంది. అధికారం, ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు ఆర్జిస్తారు. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉండడంతో పాటు.. ఏ విధమైన సమస్యలు దరిచేరవు.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..