Success Astrology
ఈ నెల 19 నుంచి ఆగస్టు 22 వరకు బుధుడు సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఇప్పటికే కుంభరాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి దృష్టి తనకు సప్తమ స్థానంలో ఉన్న తన ప్రాణ స్నేహితుడైన బుధుడి మీద పడుతుంది. ఈ రెండు గ్రహాలు ఒకరినొకరు వీక్షించుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా ఉన్నప్పుడు వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశివారికి ఈ రెండు గ్రహాల పరస్పర వీక్షణ ఎంతగానో కలిసి వస్తుంది.
- మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడు, లాభస్థానంలో శనీశ్వరుడు ఉన్నందువల్ల ఎటువంటి ఆదాయ ప్రయత్నమైనా కలిసి వచ్చి ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఉంటుంది. సహోద్యోగులను మించి అధికారులను తమ పనితీరుతో మెప్పించే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించే సూచనలున్నాయి. కుటుంబం మీద ప్రత్యేక శ్రద్ధను తీసుకునే అవకాశం ఉంది. సొంత పనులను ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి నాలుగవ స్థానంలో ఉన్న బుధుడి మీద దశమ స్థానం నుంచి శనీశ్వరుడి దృష్టి పడి నందువల్ల ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. పని చేసే సంస్థలో అత్యంత కీలకమైన, ప్రధానమైన వ్యక్తిగా మారే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఘన విజయాలు సాధిస్తాయి. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. విదేశీ అవకాశాలు బాగా ఎక్కువగా అందివస్తాయి.
- సింహం: ఈ రాశిలో ఉన్న బుధుడికి, సప్తమ స్థానంలో ఉన్న శనికి పరస్పర వీక్షణ ఏర్పడినందువల్ల వృత్తి, వ్యాపారాల్లో నిమిషం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. దీని ఫలితంగా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. రాజకీయంగా కూడా ప్రాబల్యం ఏర్పడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కెరీర్ లో శీఘ్ర పురోగతి ఉంటుంది.
- తుల: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న బుధుడితో శనికి సమ సప్తకం ఏర్పడినందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. పిల్లలకు విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగు లకు విదేశాల నుంచి ఆపర్లు అందుతాయి. సంపన్న వర్గానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. జీవితం అనేక సానుకూల మార్పులు తిరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి నాలుగవ స్థానంలో ఉన్న శనికి, దశమ స్థానంలో ఉన్న బుధుడికి పరస్పర వీక్షణ ఏర్ప డినందువల్ల ఉద్యోగంలో ప్రాభవం బాగా పెరుగుతుంది. హోదా, జీతభత్యాలు అంచనాలకు మించి పెరగడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. అనేక కష్టనష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న బుధుడి మీద తృతీయ స్థానంలో ఉన్న శని దృష్టి పడినందువల్ల అంచనాలకు మించిన ఆదాయ వృద్ధి ఉంటుంది. అతి తక్కువ ప్రయత్నంతో అత్యధిక శుభ ఫలి తాలు అనుభవానికి వస్తాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలకు సమయం బాగా అను కూ లంగా ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. కుటుంబ జీవితం మీద శ్రద్ద పెడ తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.