janmashtami 2024: మీ జీవితంలో కష్టాలా.. అర్ధరాత్రి కన్నయ్యను రాశి ప్రకారం ఇలా పూజించండి.. శుభ ఫలితాలు మీ సొంతం

|

Aug 26, 2024 | 7:30 PM

ఈ సారి జన్మాష్టమి సందర్భంగా ఎన్నో మేలు చేసే యోగాలు రూపుదిద్దుకుంటున్నాయని జ్యోతిష్కులు చెప్పారు. ద్వాపరయుగంలో కృష్ణుడు జన్మించిన సమయంలో ఎలాంటి యోగాలు ఏర్పడ్డాయో ఈసారి కూడా అవే రూపుదిద్దుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమయంలో కన్నయ్యకు పూజ చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అది కూడా తమ తమ రాశిని బట్టి గోపాలుడిని పూజిస్తే విశేష ప్రయోజనాలను పొందవచ్చు. జన్మాష్టమి సందర్భంగా రాశిని బట్టి శ్రీకృష్ణుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం..

janmashtami 2024: మీ జీవితంలో కష్టాలా.. అర్ధరాత్రి కన్నయ్యను రాశి ప్రకారం ఇలా పూజించండి.. శుభ ఫలితాలు మీ సొంతం
Janmashtami 2024
Follow us on

శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిధి రోహిణి నక్షత్రం సమయంలో జన్మాష్టమి జరుపుకుంటారు. ఈ సారి జన్మాష్టమి సందర్భంగా ఎన్నో మేలు చేసే యోగాలు రూపుదిద్దుకుంటున్నాయని జ్యోతిష్కులు చెప్పారు. ద్వాపరయుగంలో కృష్ణుడు జన్మించిన సమయంలో ఎలాంటి యోగాలు ఏర్పడ్డాయో ఈసారి కూడా అవే రూపుదిద్దుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమయంలో కన్నయ్యకు పూజ చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అది కూడా తమ తమ రాశిని బట్టి గోపాలుడిని పూజిస్తే విశేష ప్రయోజనాలను పొందవచ్చు. జన్మాష్టమి సందర్భంగా రాశిని బట్టి శ్రీకృష్ణుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం..

  1. మేషరాశి: ఈ రాశి వారు ఈ ప్రత్యేక సందర్భంలో కృష్ణుడిని పూజించడానికి ఎర్ర చందనం ఉపయోగించవచ్చు. అంతేకాదు పూజ సమయంలో కన్నయ్యకు ఎరుపు రంగు పండ్లు, పువ్వులు, బట్టలు, స్వీట్లు సమర్పించవచ్చు.
  2. వృషభ రాశి: వృషభ రాశి వారి గురించి మాట్లాడుతే జన్మాష్టమి సందర్భంగా వీరు తెలుపు రంగును ఉపయోగించాలి. తెలుపు వస్తువులను సమర్పించాలి. ఇది ఇంటికి లాభాన్ని తెస్తుంది.
  3. మిధున రాశి: ఈ రాశికి అధిపతి బుధుడుగా పరిగణించబడతారు. ఈ రాశి వారు కన్నయ్య పూజకు పచ్చని బట్టలు వేసుకోవచ్చు. అంతే కాకుండా తులసి దళాలను సమర్పించడం వల్ల కూడా మేలు జరుగుతుంది.
  4. కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వారు కన్నయ్యకు శంఖంలో నీటిని నింపి స్నానం చేయించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇలా చేయడం వల్ల ఆర్ధిక లాభాలు పొందే అవకాశం ఉంది. దీని వల్ల జీవితంలో పురోభివృద్ధి కలిగే అవకాశాలు ఉన్నాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం.. అటువంటి పరిస్థితిలో, సింహ రాశి వారు జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి వెన్న సమర్పించవచ్చు. ఇది ఇంటికి శ్రేయస్సును తెస్తుంది.
  7. కన్య రాశి: కన్యా రాశి వారు జన్మాష్టమి సందర్భంగా లడ్డూ గోపాల్‌కి పండ్లను నైవేద్యంగా సమర్పించవచ్చు. దీనివల్ల ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయి.
  8. తుల రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని పూజ సమయంలో తెల్లని వస్తువులను ఉపయోగించవచ్చు. అంతే కాకుండా పంచదార మిఠాయి, వెన్న కూడా ఈ రోజు దేవుడికి సమర్పించడం విశేష ఫలితాలు వస్తాయి.
  9. వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారు కూడా కృష్ణుడిని పూజించే సమయంలో ఎరుపు రంగును ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల భగవంతుడు సంతోషించి కోరిన కోర్కెలు తీరుస్తాడు.
  10. ధనుస్సు రాశి: జన్మాష్టమి రోజున ఈ రాశి వారు శ్రీకృష్ణుని పూజించే సమయంలో పసుపు రంగును ఉపయోగించవచ్చు. పసుపు రంగు దుస్తులు ధరించవచ్చు. కన్నయ్యకు పసుపు రంగు దుస్తులు ధరింపజేయవచ్చు. అలాగే పసుపు రంగు లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం శుభ ఫలితాలను ఇస్తుంది.
  11. మకరరాశి: ఈ రాశి వ్యక్తులు తెలుపు రంగును ఉపయోగించవచ్చు. ఈ సమయంలో కృష్ణుడికి పాలతో స్నానం చేయించడం శుభం. అంతే కాకుండా తెల్లని ఆహారాన్ని దేవునికి సమర్పించవచ్చు.
  12. కుంభ రాశి: కుంభ రాశి గురించి చెప్పాలంటే వీరు కూడా శ్రీకృష్ణుడికి పాలు, పెరుగుతో స్నానం చేయించాలి. అంతే కాకుండా పిండి పంజిరీని నైవేద్యంగా సమర్పించాలి. ఇది లాభదాయకం.
  13. మీన రాశి: ధనుస్సు రాశి వారు శ్రీకృష్ణుని పూజలో పసుపు రంగు దుస్తులను ఉపయోగించవచ్చు. అంతే కాకుండా పసుపు పువ్వులు, పసుపు లడ్డూలను కూడా దేవుడికి సమర్పించవచ్చు. దీంతో ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు