Strong Shukra: అనుకూలంగా శుక్రుడు.. ఆ రాశుల వారు విలాసవంతమైన జీవితం గడిపే ఛాన్స్.. !
అయిదు రాశులకు శుక్రుడు బాగా అనుకూలంగా ఉండడంతో రాబోయే నాలుగు నెలల కాలంలో విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉంది. ప్రస్తుతం ధనుస్సులో సంచరిస్తున్న శుక్రుడు మరి కొద్ది కాలం పాటు మిత్ర క్షేత్రాల్లో తిరగడమే కాకుండా ఆ తర్వాత కూడా తనకు ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలో ప్రవేశించడం జరుగుతుంది.
అయిదు రాశులకు శుక్రుడు బాగా అనుకూలంగా ఉండడంతో రాబోయే నాలుగు నెలల కాలంలో విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉంది. ప్రస్తుతం ధనుస్సులో సంచరిస్తున్న శుక్రుడు మరి కొద్ది కాలం పాటు మిత్ర క్షేత్రాల్లో తిరగడమే కాకుండా ఆ తర్వాత కూడా తనకు ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఫలితంగా వృషభం, సింహం, తుల, మకరం, మీన రాశుల వారికి సంపాదన బాగా పెరిగి విలాసాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారు ఎక్కువగా విలాస జీవితంలో మునిగి తేలే అవకాశం ఉంది. ఈ రాశివారికి సౌందర్య సాధనాల మీద మోజు ఎక్కువగా ఉంటుంది. ఇంటిని అందంగా అలంకరించుకోవడం మీద శ్రద్ధ చూపిస్తారు. ఈ రాశి స్వభావమే అందచందాలను ఆస్వాదించడం, ప్రేమగా ఉండడం, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడం. అందువల్ల ఈ రాశివారికి తమకు వీలైన విధంగా భోగభాగ్యాలను అనుభవించడం జరుగుతుంది.
- సింహం: సాధారణంగా ఈ రాశివారికి విలాసవంతమైన జీవితంమీదా, ఉన్నత స్థాయి వ్యక్తులతో జల్సాగా గడపడం మీదా మోజు ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉండడం, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరగడం వంటి కారణాల వల్ల వీరు అత్యధికంగా విలాస జీవితం గడిపే అవకాశం ఉంది. స్నేహితులు, స్నేహితురాళ్లతో కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా ఉంది. ఫ్యాషన్ల మీదా, విహారం మీదా ఎక్కువగా ఖర్చు చేస్తారు.
- తుల: ఈ రాశికి శుక్రుడు అధిపతి అయినందువల్ల ఈ రాశివారికి భోగభాగ్యాల మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. సౌందర్యం మీద శ్రద్ధ పెడతారు. కళాత్మకంగా కూడా వ్యవహరిస్తారు. విలాస జీవితం గడపడానికి ఇష్టపడే ఈ రాశివారు తమ ఇంటిని కూడా విలాసవంతంగా తీర్చిదిద్దుతారు. చిన్న చిన్న కార్యక్రమాలను కూడా విలాసవంతంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని, అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు.
- మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. బాగా కష్టపడి పనిచేసే తత్త్వం కలిగిన ఈ రాశివారు విలాస జీవితానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఈ రాశివారికి వచ్చే నాలుగు నెలల కాలంలో ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉన్నందువల్ల విలాస జీవితానికి సంబంధించి వీరి మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంటిని కూడా సౌందర్యవంతంగా తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది.
- మీనం: ఈ రాశివారికి సాధారణ జీవితం, నిరాడంబర జీవితం గడపడం ఏమాత్రం ఇష్టం ఉండదు. ఏ కాస్త అవకాశం వచ్చినా సౌందర్య సాధనాల మీదా, ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం మీదా, విలువైన వస్త్రాభరణాలు కొనడం మీదా ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి, ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిసి తిరగడానికి, విహార యాత్రలు చేయ డానికి ప్రాధాన్యం ఇస్తారు. ఆదాయంతో పాటే, విలాస జీవితం మీద ఖర్చు కూడా పెరుగుతుంది.