Zodiac Signs: సానుకూలంగా చంద్రుడు.. వారం రోజులు ఆ రాశుల వారికి శుభాలు, సుఖ సంతోషాలు
ఈ నెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 3 వరకు చంద్రుడు ఎటువంటి దోషాలూ లేకుండా తన మిత్ర, స్వక్షేత్రాల్లో సంచరించడం జరుగుతోంది. ఏ జాతకంలో అయినా చంద్రుడు అనుకూల సంచారం చేస్తున్నప్పుడు తప్పకుండా మనసులోని కోరికలు నెరవేరడం, ప్రతి ప్రయత్నమూ సఫలం కావడం, ధన లాభం కలగడం వంటివి జరుగుతాయి.
ఈ నెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 3 వరకు చంద్రుడు ఎటువంటి దోషాలూ లేకుండా తన మిత్ర, స్వక్షేత్రాల్లో సంచరించడం జరుగుతోంది. ఏ జాతకంలో అయినా చంద్రుడు అనుకూల సంచారం చేస్తున్నప్పుడు తప్పకుండా మనసులోని కోరికలు నెరవేరడం, ప్రతి ప్రయత్నమూ సఫలం కావడం, ధన లాభం కలగడం వంటివి జరుగుతాయి. ప్రస్తుతం చంద్రుడు సింహ, కన్య, తులా రాశుల్లో సంచారం చేయబోతున్నందువల్ల మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశులకు శుభ యోగాలు పట్టడం జరుగుతుంది. దాదాపు ఓ వారం రోజుల పాటు వీరి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది.
- మేషం: ఈ రాశికి చంద్రుడి సంచారం అనేక శుభ ఫలితాలనివ్వబోతోంది. ముఖ్యంగా పెండింగ్ పనులన్నీ పూర్తయి ఆర్థిక లాభం కలుగుతుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి వస్తుంది. మీకు రావలసిన డబ్బును వసూలు చేసుకోవడం, మీరు ఇవ్వాల్సిన డబ్బును ఇచ్చేయడం జరుగు తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. తల్లి నుంచి ఆర్థికంగా ప్రయోజనాలు కలు గుతాయి. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.
- వృషభం: ఈ రాశివారికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ప్రయ త్నపూర్వకంగానే కాక, అప్రయత్నంగా కూడా బాగా మెరుగుపడుతుంది. ప్రయాణాలు బాగా లాభి స్తాయి. సోదరులతో రాజీపడి ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. అన్ని విధాలుగానూ మన శ్శాంతి ఏర్పడుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా మారుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశినాథుడైన చంద్రుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారికి తిరుగుండదు. ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. సామాజికంగా కూడా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు బాగా వృద్ధిలోకి వస్తారు. ఇష్టమైన బంధుమిత్రులు అభివృద్ధి చెందడానికి సహా యపడతారు. గృహ, వాహన సమస్యలు తొలగిపోతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
- తుల: ఈ రాశివారికి అత్యంత శుభుడైన చంద్రుడు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల మనశ్శాంతికి, సుఖ సంతోషాలకు కొదవ ఉండదు. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడించడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు, అవి వాహితులకు ఆశించిన విధంగా శుభవార్తలు అందుతాయి. ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లడం, ఇష్ట మైన ఆలయాలను సందర్శించడం వంటివి జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి చంద్రుడు 9,10,11 స్థానాల్లో సంచరించడం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల పరంగా రాబడి పెరగడం, ఉద్యోగపరంగా ప్రమోషన్లు రావడం, జీత భత్యాలు పెరగడం వంటివి జరుగుతాయి. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. పెళ్లి ప్రయత్నాలకు సాను కూల స్పందనలు రావడం మొదలవుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు.
- మకరం: ఈ రాశికి చంద్రుడు అనుకూలంగా ఉండబోతున్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పు లకు అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నానికైనా ఇది అనుకూల సమయం అని చెప్పవచ్చు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకుంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ నిలకడగా ఉంటుంది. పుణ్య క్షేత్రాల సందర్శ నకు, విహార యాత్రలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు తప్పకుండా అందివస్తాయి.